ఇంక నేల కొంకఁ దమ యిచ్చ లనరే
(॥పల్లవి॥)
ఇంక నేల కొంకఁ దమ యిచ్చ లనరే
అంకె నే నుంటేఁ దమ కేమాయ నడగరే
(॥ఇంక నేల॥)
యేకత మాడెటి వేళ నేల నే వచ్చితినో
దాకొని నన్నుఁ గంటానే తల వంచిరి
యీకడఁ దమ కిద్దరి కెంత వెగ టైతినో
రా కున్న నెట్టాయ నింత రచ్చల కెక్కితిని
(॥ఇంక నేల॥)
మగఁడు నాలు నుండఁగ మంచ మే లెక్కితినో
చిగురుమోవులఁ దాము సిగ్గు వడిరి
సొగిసి యిద్దరి కెంత సుఖవిరుద్ద మైతినో
మొగ మియ్య ననే రంటా ముందు నుందానను
(॥ఇంక నేల॥)
యెనసినరతివేల నేల కాఁగిలించితివో
తనిసి తమమేనులు తా మెఱుఁగరు
అను వై శ్రీవెంకటేశుఁ డప్పటిని నన్నుఁ గూడె
ఘనగర్వ మనే రంటాం గాని మ్మని యంటిని
(||pallavi||)
iṁka nela kŏṁkam̐ dama yichcha lanare
aṁkĕ ne nuṁṭem̐ dama kemāya naḍagare
(||iṁka nela||)
yegada māḍĕḍi veḽa nela ne vachchidino
dāgŏni nannum̐ gaṁṭāne tala vaṁchiri
yīgaḍam̐ dama kiddari kĕṁta vĕga ṭaidino
rā kunna nĕṭṭāya niṁta rachchala kĕkkidini
(||iṁka nela||)
magam̐ḍu nālu nuṁḍam̐ga maṁcha me lĕkkidino
sigurumovulam̐ dāmu siggu vaḍiri
sŏgisi yiddari kĕṁta sukhavirudda maidino
mŏga miyya nane raṁṭā muṁdu nuṁdānanu
(||iṁka nela||)
yĕnasinaradivela nela kām̐giliṁchidivo
tanisi tamamenulu tā mĕṟum̐garu
anu vai śhrīvĕṁkaḍeśhum̐ ḍappaḍini nannum̐ gūḍĕ
ghanagarva mane raṁṭāṁ gāni mmani yaṁṭini