Imka nela aa suddulu yinniyu nimde kamtimi

ఇంక నేల ఆ సుద్దులు యిన్నియు నిందే కంటిమి
Language

(॥పల్లవి॥)
ఇంక నేల ఆ సుద్దులు యిన్నియు నిందే కంటిమి
అంకెల నీ విన్నాళ్లు అంతేసి నేరుతువా

(॥ఇంక నేల॥)
నవ్వెటినిన్నుఁ జూచి నమ్మఁగలదానఁ గాక
యెవ్వరికపటా లెట్టో యెఱఁగుదునా
మవ్వపు నీమేన నేఁడు మచ్చములు గంటిఁ గాక
నెవ్వగ నపనమ్మిక నీపై తొల్లి కంటినా

(॥ఇంకనేల॥)
నీనయగారములకు నేనే మెచ్చుకొందుఁ గాక
యే నెపానకుఁ జేయుట యెరుఁగుదునా
కానీలే నీకపటాలు కానఁబడెఁ గాక నేఁడు
నానాఁడె నీ గుణము నా కింత దెలుసునా

(॥ఇంకనేల॥)
గక్కన నీవు గూడఁగ కాని మ్మని యందుఁ గాక
యెక్కడనుండి వచ్చుట యెరుఁగుదునా
యిక్కువ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
నిక్కి నేఁడు సేసే మేలు నిన్న నెరుఁగుదునా

(||pallavi||)
iṁka nela ā suddulu yinniyu niṁde kaṁṭimi
aṁkĕla nī vinnāḽlu aṁtesi neruduvā

(||iṁka nela||)
navvĕḍininnum̐ jūsi nammam̐galadānam̐ gāga
yĕvvarigabaḍā lĕṭṭo yĕṟam̐gudunā
mavvabu nīmena nem̐ḍu machchamulu gaṁṭim̐ gāga
nĕvvaga nabanammiga nībai tŏlli kaṁṭinā

(||iṁkanela||)
nīnayagāramulagu nene mĕchchugŏṁdum̐ gāga
ye nĕbānagum̐ jeyuḍa yĕrum̐gudunā
kānīle nīgabaḍālu kānam̐baḍĕm̐ gāga nem̐ḍu
nānām̐ḍĕ nī guṇamu nā kiṁta dĕlusunā

(||iṁkanela||)
gakkana nīvu gūḍam̐ga kāni mmani yaṁdum̐ gāga
yĕkkaḍanuṁḍi vachchuḍa yĕrum̐gudunā
yikkuva śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
nikki nem̐ḍu sese melu ninna nĕrum̐gudunā