ఇంక నీవు వెఱవకు యీడ నే నుందానను
(॥పల్లవి॥)
ఇంక నీవు వెఱవకు యీడ నే నుందానను
పొంకపు నీగుణములే పోదిసేసె నిన్నును
(॥ఇంక॥)
నిన్నుఁ జేత ముట్టితేను నీవేల వులికేవు
పన్నిన మరుచి గురుబాణమా యిది
యెన్నిక యీచేఁతలను యెవ్వతె బెదరించెనో
ఇన్నిటా నీయలవాటు ఇంతసేసె నిన్నును
(॥ఇంక॥)
దగ్గరఁ గూచుండితేను తత్తరించనేల నీకు
ఆగ్గలపు నీపాలిటి ఆత్తనా నేను
దిగ్గన యెవ్వతెచే సాదింపులఁబడి వచ్చితో
యెగ్గుల నీమొగమోటే ఇంతసేసె నిన్నును
(॥ఇంక॥)
ఇట్టె నారతిలోన యేల బుసకొట్టేవు
గట్టిగా సాముచేసేటిగరిడా యిది
పట్టుక యెవ్వతే నిన్ను పంతమిచ్చి కూడెనో
యెట్టు శ్రీవేంకటేశుఁడ యెమ్మసేసె నిపుడు
(||pallavi||)
iṁka nīvu vĕṟavagu yīḍa ne nuṁdānanu
pŏṁkabu nīguṇamule podisesĕ ninnunu
(||iṁka||)
ninnum̐ jeda muṭṭidenu nīvela vuligevu
pannina marusi gurubāṇamā yidi
yĕnniga yīsem̐talanu yĕvvadĕ bĕdariṁchĕno
inniḍā nīyalavāḍu iṁtasesĕ ninnunu
(||iṁka||)
daggaram̐ gūsuṁḍidenu tattariṁchanela nīgu
āggalabu nībāliḍi āttanā nenu
diggana yĕvvadĕse sādiṁpulam̐baḍi vachchido
yĕggula nīmŏgamoḍe iṁtasesĕ ninnunu
(||iṁka||)
iṭṭĕ nāradilona yela busagŏṭṭevu
gaṭṭigā sāmuseseḍigariḍā yidi
paṭṭuga yĕvvade ninnu paṁtamichchi kūḍĕno
yĕṭṭu śhrīveṁkaḍeśhum̐ḍa yĕmmasesĕ nibuḍu