ఇంక నీవే యెఱుఁగుదు వేమీ నెఱఁగను నేను
(॥పల్లవి॥)
ఇంక నీవే యెఱుఁగుదు వేమీ నెఱఁగను నేను
వుంకువగా నీ గుణాలే వుబ్బు రేఁచీని
(॥ఇంక॥)
వలపులు నీమీఁదివి వరుసలు పెట్టుకొని
తలపించి మదిలోన దైలువారీని
పలుకులలో నీ పేరు పలుమారు దొరలుక
యెలయించి నీపొందు లెచ్చరించీని
(॥ఇంక॥)
చూచిననాచూవులలో సూటియై నీరూపులే
కాచుకొని నామనసు గరగించీని
యేచిన నావీను లివి యిక్కువైననీకతలు
లాచి లాచి యట్టె మేలములాడీని
(॥ఇంక॥)
నెమ్మది నాకరములు నీకాఁగిటఁబెనగిని
వుమ్మగిలురతులలో నోలలాడీని
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
తమ్మినామోము నీమోవితావి గోలీని
(||pallavi||)
iṁka nīve yĕṟum̐gudu vemī nĕṟam̐ganu nenu
vuṁkuvagā nī guṇāle vubbu rem̐sīni
(||iṁka||)
valabulu nīmīm̐divi varusalu pĕṭṭugŏni
talabiṁchi madilona dailuvārīni
palugulalo nī peru palumāru dŏraluga
yĕlayiṁchi nībŏṁdu lĕchchariṁchīni
(||iṁka||)
sūsinanāsūvulalo sūḍiyai nīrūbule
kāsugŏni nāmanasu garagiṁchīni
yesina nāvīnu livi yikkuvainanīgadalu
lāsi lāsi yaṭṭĕ melamulāḍīni
(||iṁka||)
nĕmmadi nāgaramulu nīgām̐giḍam̐bĕnagini
vummagiluradulalo nolalāḍīni
yimmula śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
tammināmomu nīmovidāvi golīni