Imka neesittamugolamdi didemaamta

ఇంక నీచిత్తముకొలఁది దిదేమాఁట
Language

(॥పల్లవి॥)
ఇంక నీచిత్తముకొలఁది దిదేమాఁట
అంకెల చెలికడకు నంపనేల నన్నును

(॥ఇంక॥)
చెప్పిచూపవచ్చుఁగాని చెట్టవట్టి తియ్యరాదు
ఇప్పుడెట్టున్నదో గాని చెలి యిదేమాట
రెప్పలెత్తవచ్చుఁగాని రిచ్చవడివుండరాదు
అప్పటి చెలికడకు నంపనేల నన్నును

(॥ఇంక॥)
మోముచూడవచ్చుఁగాని మోహము గడించరాదు
యీమగువప్రాణ మెత్తు మిదేమాట
దోమటిదొడకవచ్చుఁ దూరి కాలుదొక్కరాదు
ఆమాట చెలికిఁ జెప్ప నంపనేల నన్నును

(॥ఇంక॥)
పంతమాడవచ్చుఁగాని పాడిదప్పకుండరాదు
యింతలో చెలిఁ గూడితి విదేమాట
చెంతల శ్రీవేంకటేశ్వర చెల్లుఁజెల్లు నిద్దరికి
అంతయు మేలాయ నిఁక నంపనేల నన్నును

(||pallavi||)
iṁka nīsittamugŏlam̐di didemām̐ṭa
aṁkĕla sĕligaḍagu naṁpanela nannunu

(||iṁka||)
sĕppisūbavachchum̐gāni sĕṭṭavaṭṭi tiyyarādu
ippuḍĕṭṭunnado gāni sĕli yidemāḍa
rĕppalĕttavachchum̐gāni richchavaḍivuṁḍarādu
appaḍi sĕligaḍagu naṁpanela nannunu

(||iṁka||)
momusūḍavachchum̐gāni mohamu gaḍiṁcharādu
yīmaguvaprāṇa mĕttu midemāḍa
domaḍidŏḍagavachchum̐ dūri kāludŏkkarādu
āmāḍa sĕligim̐ jĕppa naṁpanela nannunu

(||iṁka||)
paṁtamāḍavachchum̐gāni pāḍidappaguṁḍarādu
yiṁtalo sĕlim̐ gūḍidi videmāḍa
sĕṁtala śhrīveṁkaḍeśhvara sĕllum̐jĕllu niddarigi
aṁtayu melāya nim̐ka naṁpanela nannunu