ఇంక నీచిత్తముకొలఁ దెట్టయినాఁ గరుణించు
(॥పల్లవి॥)
ఇంక నీచిత్తముకొలఁ దెట్టయినాఁ గరుణించు
అంకెల మా విన్నపము లవధరించవయ్యా
(॥ఇంక॥)
సలిగె గలిగితేను సరసము లమరును
వెలినున్నవారికి వేసాలందురు
కలసినచుట్టాలైతే సొలయఁగజెల్లును
బలిమి వింతవారికిఁ బనిలేదు
(॥ఇంక॥)
యెనసినవావులైతే యేమిసేసినాఁ జెల్లు
మనసురానివారికి మాయలందురు
ననుపైనకాంతలు పెనఁగితే నీడేరు
చెనకఁ బెరవారికి చేతికి లోఁగారు
(॥ఇంక॥)
తగులైనవారికిఁ దమకించఁ బాడియౌను
సొగయనివారికి సోద్యమందురు
నిగిడి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
మొగి నన్నేలితివి కిమ్ములవారి కబ్బదు
(||pallavi||)
iṁka nīsittamugŏlam̐ dĕṭṭayinām̐ garuṇiṁchu
aṁkĕla mā vinnabamu lavadhariṁchavayyā
(||iṁka||)
saligĕ galigidenu sarasamu lamarunu
vĕlinunnavārigi vesālaṁduru
kalasinasuṭṭālaide sŏlayam̐gajĕllunu
balimi viṁtavārigim̐ baniledu
(||iṁka||)
yĕnasinavāvulaide yemisesinām̐ jĕllu
manasurānivārigi māyalaṁduru
nanubainagāṁtalu pĕnam̐gide nīḍeru
sĕnagam̐ bĕravārigi sedigi lom̐gāru
(||iṁka||)
tagulainavārigim̐ damagiṁcham̐ bāḍiyaunu
sŏgayanivārigi sodyamaṁduru
nigiḍi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
mŏgi nannelidivi kimmulavāri kabbadu