Imka neesittamugoddi yimtibhaagyamu

ఇంక నీచిత్తముకొద్ది యింతిభాగ్యము
Language

(॥పల్లవి॥)
ఇంక నీచిత్తముకొద్ది యింతిభాగ్యము
వుంకువ కోరికెలలో నోలలాడీ నదివో

(॥ఇంక॥)
వనిత వాలుక చూపు వంచి(అట్టె)
పెనఁగుచు పులకలు పెంచి
మునుకొన్న తమకము ముంచీనదె
గునిసి నీతో నలుగఁ గొంచీనదివో

(॥ఇంక॥)
పొలసి మోహముమాట పొదిగి అట్టె
సెలవుల నవ్వులెల్లాఁ జిదిగి
యెలమి జవ్వనమున నెదిగి
వులివచ్చి గోరుమోప నొదిగీనదివో

(॥ఇంక॥)
మోక్కపుటూరుపులు విసరి అట్టె
గుక్కక పైపై రతులు గొసరి
చక్కని శ్రీవేంకటేశ సతి గూడి నిన్ను
మొక్కుచు మోవితేనెకు ముసరీనదివో

(||pallavi||)
iṁka nīsittamugŏddi yiṁtibhāgyamu
vuṁkuva korigĕlalo nolalāḍī nadivo

(||iṁka||)
vanida vāluga sūbu vaṁchi(aṭṭĕ)
pĕnam̐gusu pulagalu pĕṁchi
munugŏnna tamagamu muṁchīnadĕ
gunisi nīdo nalugam̐ gŏṁchīnadivo

(||iṁka||)
pŏlasi mohamumāḍa pŏdigi aṭṭĕ
sĕlavula navvulĕllām̐ jidigi
yĕlami javvanamuna nĕdigi
vulivachchi gorumoba nŏdigīnadivo

(||iṁka||)
mokkabuḍūrubulu visari aṭṭĕ
gukkaga paibai radulu gŏsari
sakkani śhrīveṁkaḍeśha sadi gūḍi ninnu
mŏkkusu movidenĕgu musarīnadivo