ఇంక నీచిత్తమేకాని యీపె కడ మేమి లేదు
(॥పల్లవి॥)
ఇంక నీచిత్తమేకాని యీపె కడ మేమి లేదు
అంకెల నీకె గుణమే లరసేవు నీవు
(॥ఇంక॥)
పవళించి వుండితే నీపాదా లోత్తనేరుచు
ఇవలఁ గూచుండి విడెమియ్యనేరుచు
నవకమై లాలించితే నవ్వులు నవ్వనేరుచు
నివిరి ఇంకా నేమైనా నేరువు మీకెకును
(॥ఇంక॥)
మచ్చిక నీవుసేసితే మాటాలాడనేరుచు
ఇచ్చగించితే వీణె వాయించనేరుచు
పచ్చిగా మన్నించితే పక్కనుండనేరుచు
నిచ్చనిచ్చ యేమైనా నేరువు మీకెకును
(॥ఇంక॥)
కానిమ్మనివుంటే మతి గరఁగించనేరుచు
మేనంటినీవు గూడితే మెచ్చనేరుచు
యే నలమేలుమంగను నన్నేలితి శ్రీవేంకటేశ
నీనేరుపు లేమైనా నేరుపు మీకెకును
(||pallavi||)
iṁka nīsittamegāni yībĕ kaḍa memi ledu
aṁkĕla nīgĕ guṇame larasevu nīvu
(||iṁka||)
pavaḽiṁchi vuṁḍide nībādā lottanerusu
ivalam̐ gūsuṁḍi viḍĕmiyyanerusu
navagamai lāliṁchide navvulu navvanerusu
niviri iṁkā nemainā neruvu mīgĕgunu
(||iṁka||)
machchiga nīvuseside māḍālāḍanerusu
ichchagiṁchide vīṇĕ vāyiṁchanerusu
pachchigā manniṁchide pakkanuṁḍanerusu
nichchanichcha yemainā neruvu mīgĕgunu
(||iṁka||)
kānimmanivuṁṭe madi garam̐giṁchanerusu
menaṁṭinīvu gūḍide mĕchchanerusu
ye nalamelumaṁganu nannelidi śhrīveṁkaḍeśha
nīnerubu lemainā nerubu mīgĕgunu