ఇంక నీ చిత్తం బెట్టయిన రక్షించు
(॥పల్లవి॥)
ఇంక నీ చిత్తం బెట్టయిన రక్షించు
లంకెల మాటల లాలించితివి
(॥ఇంక॥)
వుంకునిచ్చి నను వొడఁబఱపించిటు
అంకెలఁ బెండ్లి ఆడితివి
సంకెదేరఁ గడు సరసములాడుచు
కంకణములు మరి కట్టితివి
(॥ఇంక॥)
ననుపుసేసుకొని నవ్వులు నవ్వుచు
చనవున సేసలు చల్లితివి
వనితలలోపల వాసితోడనే
పెనఁగుచు బువ్వానఁ బెట్టుకొంటివి
(॥ఇంక॥)
కలసిమెలసి నను కాఁగిట నింపుచు
తొలుతనె పాదము దొక్కితివి
యెలమిని శ్రీ వేంకటేశుఁడ నన్నేలి
మలసి రతులఁ గడు మన్నించితివి
(||pallavi||)
iṁka nī sittaṁ bĕṭṭayina rakṣhiṁchu
laṁkĕla māḍala lāliṁchidivi
(||iṁka||)
vuṁkunichchi nanu vŏḍam̐baṟabiṁchiḍu
aṁkĕlam̐ bĕṁḍli āḍidivi
saṁkĕderam̐ gaḍu sarasamulāḍusu
kaṁkaṇamulu mari kaṭṭidivi
(||iṁka||)
nanubusesugŏni navvulu navvusu
sanavuna sesalu sallidivi
vanidalalobala vāsidoḍane
pĕnam̐gusu buvvānam̐ bĕṭṭugŏṁṭivi
(||iṁka||)
kalasimĕlasi nanu kām̐giḍa niṁpusu
tŏludanĕ pādamu dŏkkidivi
yĕlamini śhrī veṁkaḍeśhum̐ḍa nanneli
malasi radulam̐ gaḍu manniṁchidivi