Imka nee manasu yenase naa valabu

ఇంక నీ మనసు యెనసె నా వలపు
Language

(॥పల్లవి॥)
ఇంక నీ మనసు యెనసె నా వలపు
జంకించినంతనే జల్లనె మేను

(॥ఇంక॥)
తలఁపులోన నినుఁ దలఁచినమాత్రన
పులకల మొలకలు పొదలనివె
పిలిచి పేరుకొని ప్రియపడినంతనె
నిలువునఁ జెమటలు నిండె నివె

(॥ఇంక॥)
గుఱిగా నిను గనుఁగొనినయంతనె
గిఱిగొన నూర్పులు కెరలె నివె
చిఱునవ్వులు గడుఁజిందినంతనె
వెఱగులు కన్నుల వెలసె నివె

(॥ఇంక॥)
కైవశమై నినుఁ గలసినంతనే
భావపుముదములు బలిసె నిదె
శ్రీవేంకటేశ నే జిగి నలమేల్మంగ-
సేవల నారతు నెసగె నివె

(||pallavi||)
iṁka nī manasu yĕnasĕ nā valabu
jaṁkiṁchinaṁtane jallanĕ menu

(||iṁka||)
talam̐pulona ninum̐ dalam̐sinamātrana
pulagala mŏlagalu pŏdalanivĕ
pilisi perugŏni priyabaḍinaṁtanĕ
niluvunam̐ jĕmaḍalu niṁḍĕ nivĕ

(||iṁka||)
guṟigā ninu ganum̐gŏninayaṁtanĕ
giṟigŏna nūrbulu kĕralĕ nivĕ
siṟunavvulu gaḍum̐jiṁdinaṁtanĕ
vĕṟagulu kannula vĕlasĕ nivĕ

(||iṁka||)
kaivaśhamai ninum̐ galasinaṁtane
bhāvabumudamulu balisĕ nidĕ
śhrīveṁkaḍeśha ne jigi nalamelmaṁga-
sevala nāradu nĕsagĕ nivĕ