ఇంక నేడసుద్దులు యెవ్వరు నేమి చెప్పేరు
(॥పల్లవి॥)
ఇంక నేడసుద్దులు యెవ్వరు నేమి చెప్పేరు
వంకలొత్తి మూడిఁజొచ్చి వాత వెళ్లివత్తునే
(॥ఇంక॥)
వొల్లనే వద్దఁగూచుండి వొనగూడ మాటలాడి
బల్లిదురాలవైతివే పతి యెదుటను
అల్లన నీవు గోరినట్టాతఁడు నీసొమ్మాయ
చెల్లునే ఇంతటా నీకుఁ జేసినట్టేల్లాను
(॥ఇంక॥)
మచ్చికఁ బాదములొత్తి మంచముమీఁదట నెక్కి
అచ్చమై యాతనికి నిల్లాల వైతివే
కచ్చుపెట్టి యాతఁడు నీకైవసరమైవున్నవాఁడు
అచ్చివచ్చునే నీకు నాతనిపై వలపు
(॥ఇంక॥)
వీడెమిచ్చి తమిరేఁచి వెలయఁగఁ దెరవేసి
తోడనే కాఁగిటఁ గూడి దొరవైతివే
వోడక శ్రీవేంకటేశు డొద్దికై నిన్నుఁ గూడఁగ
యీడేరితి వౌదువు నన్నితఁడే యేలెఁగదే
(||pallavi||)
iṁka neḍasuddulu yĕvvaru nemi sĕpperu
vaṁkalŏtti mūḍim̐jŏchchi vāda vĕḽlivattune
(||iṁka||)
vŏllane vaddam̐gūsuṁḍi vŏnagūḍa māḍalāḍi
ballidurālavaidive padi yĕduḍanu
allana nīvu gorinaṭṭādam̐ḍu nīsŏmmāya
sĕllune iṁtaḍā nīgum̐ jesinaṭṭellānu
(||iṁka||)
machchigam̐ bādamulŏtti maṁchamumīm̐daḍa nĕkki
achchamai yādanigi nillāla vaidive
kachchubĕṭṭi yādam̐ḍu nīgaivasaramaivunnavām̐ḍu
achchivachchune nīgu nādanibai valabu
(||iṁka||)
vīḍĕmichchi tamirem̐si vĕlayam̐gam̐ dĕravesi
toḍane kām̐giḍam̐ gūḍi dŏravaidive
voḍaga śhrīveṁkaḍeśhu ḍŏddigai ninnum̐ gūḍam̐ga
yīḍeridi vauduvu nannidam̐ḍe yelĕm̐gade