ఇంక నేడసుద్ది నీవు యెవ్వరికి లోనయ్యేవు
(॥పల్లవి॥)
ఇంక నేడసుద్ది నీవు యెవ్వరికి లోనయ్యేవు
సంకె విడిచిన మీఁద సంగతౌనా దూరను
(॥ఇంక॥)
చక్కఁదనములు చూపి జాణతనములె యాడి
చిక్కించుకొనెఁగా నిన్ను చిత్తణి యాసె
ఇక్కువ లంటి నిన్ను నెవ్వరు తమిరేఁచినా
కక్కసమై వుండుఁగాక కరంగీనా మనసు
(॥ఇంక॥)
మోవితేనెలు కురిసి ముసిముసినవ్వు నవ్వి
కైవసము చేసుకొనెఁగా నిన్నాపె
భావించి యెవ్వతెకైనాఁ బనికివచ్చేవా నేఁడు
నీవోజ నిలుచుఁగాక నేర్పులు వచ్చీనా
(॥ఇంక॥)
పూడిగాలెల్లఁ జేసి వూరకే చన్నుల నొత్తి
కూడెఁగా శ్రీవేంకటేశ కోరి నిన్నా పె
యీడ నలమేలుమంగనయిననన్ను నేలితివి
వెనుకై వుందువుగాక వింతగా జూచేవా
(||pallavi||)
iṁka neḍasuddi nīvu yĕvvarigi lonayyevu
saṁkĕ viḍisina mīm̐da saṁgadaunā dūranu
(||iṁka||)
sakkam̐danamulu sūbi jāṇadanamulĕ yāḍi
sikkiṁchugŏnĕm̐gā ninnu sittaṇi yāsĕ
ikkuva laṁṭi ninnu nĕvvaru tamirem̐sinā
kakkasamai vuṁḍum̐gāga karaṁgīnā manasu
(||iṁka||)
movidenĕlu kurisi musimusinavvu navvi
kaivasamu sesugŏnĕm̐gā ninnābĕ
bhāviṁchi yĕvvadĕgainām̐ banigivachchevā nem̐ḍu
nīvoja nilusum̐gāga nerbulu vachchīnā
(||iṁka||)
pūḍigālĕllam̐ jesi vūrage sannula nŏtti
kūḍĕm̐gā śhrīveṁkaḍeśha kori ninnā pĕ
yīḍa nalamelumaṁganayinanannu nelidivi
vĕnugai vuṁduvugāga viṁtagā jūsevā