Imka ne suddulu yeramgamide

ఇంక నే సుద్దులు యెరఁగమిదే
Language

(॥పల్లవి॥)
ఇంక నే సుద్దులు యెరఁగమిదే
సంకె లేని కోర్కె సఫలంబాయ

(॥ఇంక॥)
నిలువునఁ బులకలు నిండఁగ నిండఁగ
పొలఁతి వలపు పూవక పూచె
పొలయుచు నీపేరు కిన్నెర మీటఁగ
కలికిచనుఁగవలు కాయక కాచె

(॥ఇంక॥)
పనివడి ప్రియములు పలుకఁగఁబలుకఁగ
ననుపుమెవి పండక పండె
ఘనమగు కాఁకల కడు చెమరించఁగ
వొనర నవరసములొలుకక వొలికె

(॥ఇంక॥)
సుడిగొని నీపలు సోఁకఁగ సోఁకఁగ
వడిగొని మై మరవక మరచె
యెడయక శ్రీవేంకటేశ నినుఁగలసి
పొడవుగ నిను చెలి పొగడక పొగడె

(||pallavi||)
iṁka ne suddulu yĕram̐gamide
saṁkĕ leni korgĕ saphalaṁbāya

(||iṁka||)
niluvunam̐ bulagalu niṁḍam̐ga niṁḍam̐ga
pŏlam̐ti valabu pūvaga pūsĕ
pŏlayusu nīberu kinnĕra mīḍam̐ga
kaligisanum̐gavalu kāyaga kāsĕ

(||iṁka||)
panivaḍi priyamulu palugam̐gam̐balugam̐ga
nanubumĕvi paṁḍaga paṁḍĕ
ghanamagu kām̐kala kaḍu sĕmariṁcham̐ga
vŏnara navarasamulŏlugaga vŏligĕ

(||iṁka||)
suḍigŏni nībalu som̐kam̐ga som̐kam̐ga
vaḍigŏni mai maravaga marasĕ
yĕḍayaga śhrīveṁkaḍeśha ninum̐galasi
pŏḍavuga ninu sĕli pŏgaḍaga pŏgaḍĕ