Im(im?)taa neemahimale yela navvevu

ఇఁ(ఇం?)తా నీమహిమలే యేల నవ్వేవు
Language

(॥పల్లవి॥)
ఇఁ(ఇం?)తా నీమహిమలే యేల నవ్వేవు
ఇంతులెల్లా నుండఁగానే యేల నవ్వేవు

(॥ఇంతా॥)
దవ్వులనుండినదాన దగ్గరివచ్చితి నింతే
యెవ్వరు నిన్నేమని రేల నవ్వేవు
పవ్వళించివుండఁగాను పనీనరు చల్లితి నింతే
యివ్వల నామోము చూచి యేల నవ్వేవు

(॥ఇంతా॥)
యిచ్చకములాడి నీకు యిటు ప్రియాలు చెప్పితే
యెచ్చరి నీవే తెలిసి యేల నవ్వేవు
మెచ్చి మెచ్చి చనవుతో మేలములాడినందుకు
యెచ్చుకుందు లాయనంటా యేల నవ్వేవు

(॥ఇంతా॥)
కాయకపుచెమటలు కడిగి కడిగి నేను
యీయెడ నిన్నుఁ గూడితే యేల నవ్వేవు
పాయపుశ్రీవేంకటేశ పనులెల్లాఁ జక్కనాయ
యీయరానిచన విచ్చి యేల నవ్వేవు

(||pallavi||)
im̐(iṁ?)tā nīmahimale yela navvevu
iṁtulĕllā nuṁḍam̐gāne yela navvevu

(||iṁtā||)
davvulanuṁḍinadāna daggarivachchidi niṁte
yĕvvaru ninnemani rela navvevu
pavvaḽiṁchivuṁḍam̐gānu panīnaru sallidi niṁte
yivvala nāmomu sūsi yela navvevu

(||iṁtā||)
yichchagamulāḍi nīgu yiḍu priyālu sĕppide
yĕchchari nīve tĕlisi yela navvevu
mĕchchi mĕchchi sanavudo melamulāḍinaṁdugu
yĕchchuguṁdu lāyanaṁṭā yela navvevu

(||iṁtā||)
kāyagabusĕmaḍalu kaḍigi kaḍigi nenu
yīyĕḍa ninnum̐ gūḍide yela navvevu
pāyabuśhrīveṁkaḍeśha panulĕllām̐ jakkanāya
yīyarānisana vichchi yela navvevu