ఇంగితాకారము లెల్ల నెరిఁగినవాఁడవు
(॥పల్లవి॥)
ఇంగితాకారము లెల్ల నెరిఁగినవాఁడవు
సంగతాయఁ బనులెల్ల జయవెట్టే మయ్యా
(॥ఇంగితా॥)
చెలియభారము నీది సిగ్గులు నీ చేతివి
పలువిన్నపము లిఁకఁ బని లే దయ్యా
అలరినే మాడేమాట లన్నియు నీ వాడితివి
చలువాయ మా మనసు సారె మెక్కే మయ్యా
(॥ఇంగితా॥)
వనితపాలిటి దిద వహించుకో కిఁకఁ బోదు
అనఁగి పెనఁగ నోతో నంత యేలయ్యా
ననుపు లెల్లా నెరపి నమ్మిక నీ విచ్చితివి
తనిసితి మిఁక నీ చేఁతలకు లో నయ్యా
(॥ఇంగితా॥)
కోమలి మన్నన నీది కోరికె లెల్లా నీవి
వేమరు మండాటాల వింత లే లయ్యా
కామించి శ్రీవెంకటేశ కలసితివి యింతిని
ఆముకొంటి మిఁక నిన్ను నట్టె మెచ్చే మయ్యా
(||pallavi||)
iṁgidāgāramu lĕlla nĕrim̐ginavām̐ḍavu
saṁgadāyam̐ banulĕlla jayavĕṭṭe mayyā
(||iṁgidā||)
sĕliyabhāramu nīdi siggulu nī sedivi
paluvinnabamu lim̐kam̐ bani le dayyā
alarine māḍemāḍa lanniyu nī vāḍidivi
saluvāya mā manasu sārĕ mĕkke mayyā
(||iṁgidā||)
vanidabāliḍi dida vahiṁchugo kim̐kam̐ bodu
anam̐gi pĕnam̐ga nodo naṁta yelayyā
nanubu lĕllā nĕrabi nammiga nī vichchidivi
tanisidi mim̐ka nī sem̐talagu lo nayyā
(||iṁgidā||)
komali mannana nīdi korigĕ lĕllā nīvi
vemaru maṁḍāḍāla viṁta le layyā
kāmiṁchi śhrīvĕṁkaḍeśha kalasidivi yiṁtini
āmugŏṁṭi mim̐ka ninnu naṭṭĕ mĕchche mayyā