ఇంగిత మిటు నీ వెరుఁగుదు నందువు
(॥పల్లవి॥)
ఇంగిత మిటు నీ వెరుఁగుదు నందువు
పొంగుచు నాపెనె పొదుగఁగ రాదా
(॥ఇంగి॥)
చౌకపునడపుల సందడింపులను
చేకొనఁ గైదండ చెలి మరచె
పైకొని కెంగేలు పట్టుక యీవేళ
యీకాంతకు చనవియ్యఁగ రాదా
(॥ఇంగి॥)
రమణికుచంబుల రాయిడింపులను
అమరి జారుఁబయ్యద మరచె
చెమటలు విసరెడిచేఁతల నెపమున
రమణుఁడ మరఁగుసురటి యిడ రాదా
(॥ఇంగి॥)
తుదఁగనుచూపుల తోదోపులనే
కదిమిన నిదురలగతి మరచె
యిదివో శ్రీవేంకటేశ నీ వీపెను
పదిరి కూడితివి పలుకఁగ రాదా
(||pallavi||)
iṁgida miḍu nī vĕrum̐gudu naṁduvu
pŏṁgusu nābĕnĕ pŏdugam̐ga rādā
(||iṁgi||)
saugabunaḍabula saṁdaḍiṁpulanu
segŏnam̐ gaidaṁḍa sĕli marasĕ
paigŏni kĕṁgelu paṭṭuga yīveḽa
yīgāṁtagu sanaviyyam̐ga rādā
(||iṁgi||)
ramaṇigusaṁbula rāyiḍiṁpulanu
amari jārum̐bayyada marasĕ
sĕmaḍalu visarĕḍisem̐tala nĕbamuna
ramaṇum̐ḍa maram̐gusuraḍi yiḍa rādā
(||iṁgi||)
tudam̐ganusūbula todobulane
kadimina niduralagadi marasĕ
yidivo śhrīveṁkaḍeśha nī vībĕnu
padiri kūḍidivi palugam̐ga rādā