ఇంగిత మెఱఁగలేవా యింత జాణవు
(॥పల్లవి॥)
ఇంగిత మెఱఁగలేవా యింత జాణవు
వుంగిటిగా నాపెనేల వొరసేవు నీవు
(॥ఇంగి॥)
నగవె ననుపు నయమె ప్రియము
తెగువే తెలివి దినదినమూ
మగువనుఁ జూడరాడా మాటాడ సిగ్గువడీని
అగడుసేసి యేల అడిగేవు నీవు
(॥ఇంగి॥)
పిలుపే నిలుపు పెనఁగుటే తగులు
చలిమే బలిమి సారెసారెకూ
కలదు యీచెలియందే; గక్కన గుట్టుతోనుంటే
సొలసి యాపెతోనేల సోదించేవు నీవు
(॥ఇంగి॥)
మరులే మచ్చికలూ మానమే మోనము
కరఁగులే యితవులు కలకాలమూ
మరలి ని న్నలమేల్మంగ శ్రీవేంకటేశుఁడ
యిరవై సొలసె నీ వింకానేల సొలసేవు
(||pallavi||)
iṁgida mĕṟam̐galevā yiṁta jāṇavu
vuṁgiḍigā nābĕnela vŏrasevu nīvu
(||iṁgi||)
nagavĕ nanubu nayamĕ priyamu
tĕguve tĕlivi dinadinamū
maguvanum̐ jūḍarāḍā māḍāḍa sigguvaḍīni
agaḍusesi yela aḍigevu nīvu
(||iṁgi||)
pilube nilubu pĕnam̐guḍe tagulu
salime balimi sārĕsārĕgū
kaladu yīsĕliyaṁde; gakkana guṭṭudonuṁṭe
sŏlasi yābĕdonela sodiṁchevu nīvu
(||iṁgi||)
marule machchigalū māname monamu
karam̐gule yidavulu kalagālamū
marali ni nnalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍa
yiravai sŏlasĕ nī viṁkānela sŏlasevu