ఇందువంక నేమి వచ్చీ నేల తలవంచేవు
(॥పల్లవి॥)
ఇందువంక నేమి వచ్చీ నేల తలవంచేవు
పందెములు వేసి వేసి పైకొందువుగాక
(॥ఇందు॥)
సరసములాడఁగాను చలము సాదింతురా
నొరసి విభునితో నవ్వుదురుగాక
శిరసువట్టుకుండఁగా సేసేదేమి నీ విఁక
సరిగా నీకుచముల సాదింతువుగాక
(॥ఇందు॥)
వావు లిట్టె చెప్పఁగాను వాదులకు వత్తురా
సేవలెల్లా నాతనికిఁ జేతురుగాక
మోవ నాతఁడాడఁగాను ముందరిమాటిఁకనేది
కావరపుఁదిట్లను కరఁగింతు గాక
(॥ఇందు॥)
పట్టి కాఁగిలించుకోఁగా బలుములు సేతురా
వొట్టుక కాఁగిట గూడివుందువుగాక
గట్టిగాఁ గలసె శ్రీ వేంకటపతి పాయరాదు
జట్టి గొన్న రతులలో జంకింతువు గాక
(||pallavi||)
iṁduvaṁka nemi vachchī nela talavaṁchevu
paṁdĕmulu vesi vesi paigŏṁduvugāga
(||iṁdu||)
sarasamulāḍam̐gānu salamu sādiṁturā
nŏrasi vibhunido navvudurugāga
śhirasuvaṭṭuguṁḍam̐gā sesedemi nī vim̐ka
sarigā nīgusamula sādiṁtuvugāga
(||iṁdu||)
vāvu liṭṭĕ sĕppam̐gānu vādulagu vatturā
sevalĕllā nādanigim̐ jedurugāga
mova nādam̐ḍāḍam̐gānu muṁdarimāḍim̐kanedi
kāvarabum̐diṭlanu karam̐giṁtu gāga
(||iṁdu||)
paṭṭi kām̐giliṁchugom̐gā balumulu sedurā
vŏṭṭuga kām̐giḍa gūḍivuṁduvugāga
gaṭṭigām̐ galasĕ śhrī veṁkaḍabadi pāyarādu
jaṭṭi gŏnna radulalo jaṁkiṁtuvu gāga