Imduvalla nemigaddu yinubaguggillimte

ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే
Language

(॥పల్లవి॥)
ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే
యిందిరారమణు సేవే యిరవైన పదవి

(॥ఇందు॥)
సతులతో నవ్వులు చందమామగుటుకలు
మతితలపోఁత లెండమావులనీళ్ళు
రతులతో మాటలు రావిమానిపువ్వులు
తతి విరహపుకాఁక తాటిమావినీడ

(॥ఇందు॥)
లలనల జవ్వనాలు లక్కపూసకపురులు
నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత
చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు
కొలఁదిలేని ననుపు గోడమీఁది సున్నము

(॥ఇందు॥)
పడఁతుల వేడుకలు పచ్చివడఁగండ్ల గుళ్లు
కడుమోవితీపు చింతకాయకజ్జము
బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁ-
డడరించిన మాయలు అద్దములో నీడలు

(||pallavi||)
iṁduvalla nemigaddu yinubaguggiḽliṁte
yiṁdirāramaṇu seve yiravaina padavi

(||iṁdu||)
sadulado navvulu saṁdamāmaguḍugalu
madidalabom̐ta lĕṁḍamāvulanīḽḽu
radulado māḍalu rāvimānibuvvulu
tadi virahabugām̐ka tāḍimāvinīḍa

(||iṁdu||)
lalanala javvanālu lakkabūsagaburulu
nĕlagŏni sese batti nīḍibai vrāda
sĕluvabu vinayālu semagūraśhaityālu
kŏlam̐dileni nanubu goḍamīm̐di sunnamu

(||iṁdu||)
paḍam̐tula veḍugalu pachchivaḍam̐gaṁḍla guḽlu
kaḍumovidību siṁtagāyagajjamu
baḍi nalumelumaṁgabadi śhrīveṁkaḍeśhvarum̐-
ḍaḍariṁchina māyalu addamulo nīḍalu