Imdunu badimaalimcha nidi yelayyaa

ఇందును బతిమాలించ నిది యేలయ్యా
Language

(॥పల్లవి॥)
ఇందును బతిమాలించ నిది యేలయ్యా
అంది దవ్వు చుట్టరిక మదియే మేలును

(॥ఇందు॥)
పన్నినతెరమఱఁగు బహురూపములెల్లాను
కన్నదాఁకానే కాని కడఁ జవుకే
యెన్నిక నీనాపొందు లెడనివుండఁగఁగాని
మన్ననఁ గూడినమీఁద మరి ఇట్టెపో

(॥ఇందు॥)
వోడక ముచ్చటమాట లొకరొకరు గదిసి
ఆడినదాఁకానేకి అంతటఁ జౌక
యీడ నీనాయెడమాట లింతులాడఁగానేకాని
కూడిమాటాడితి నిఁకఁ గొస రింతేపో

(॥ఇందు॥)
గరిమ సమరతులు కడుఁజలములు మేను
మరిగినదాఁకాఁ గాని మరిచౌకే
సిరుల శ్రీవేంకటేశ చేరి నీకాఁగిట నేను
అరమరచితిఁ బను లన్నియు నింతేపో

(||pallavi||)
iṁdunu badimāliṁcha nidi yelayyā
aṁdi davvu suṭṭariga madiye melunu

(||iṁdu||)
panninadĕramaṟam̐gu bahurūbamulĕllānu
kannadām̐kāne kāni kaḍam̐ javuge
yĕnniga nīnābŏṁdu lĕḍanivuṁḍam̐gam̐gāni
mannanam̐ gūḍinamīm̐da mari iṭṭĕbo

(||iṁdu||)
voḍaga muchchaḍamāḍa lŏgarŏgaru gadisi
āḍinadām̐kānegi aṁtaḍam̐ jauga
yīḍa nīnāyĕḍamāḍa liṁtulāḍam̐gānegāni
kūḍimāḍāḍidi nim̐kam̐ gŏsa riṁtebo

(||iṁdu||)
garima samaradulu kaḍum̐jalamulu menu
mariginadām̐kām̐ gāni marisauge
sirula śhrīveṁkaḍeśha seri nīgām̐giḍa nenu
aramarasidim̐ banu lanniyu niṁtebo