ఇందునే బతుకవయ్య యిన్నాళ్లకైనా నీవు
(॥పల్లవి॥)
ఇందునే బతుకవయ్య యిన్నాళ్లకైనా నీవు
కందువ గంటివిగా యిక్కడనున్నవేళను
(॥ఇందు॥)
ముచ్చటాఁడ గలిగెఁగా ముదిత నీకొక్కతైనా
కెచ్చురేఁగి నాతోనలిగినవేళను
వచ్చిపోఁగలిగిరిగా వాకిటికి వాడవారు
నచ్చుకొట్టి నిన్ను నే మనసు చూచేవేళను
(॥ఇందు॥)
యింత నవ్వఁగలిగెఁగా యిరుగు పొరుగు నీకు
చెంతల నీ నిన్ను సాదించేవేళను
పొంతనే కలిగిరిగా బుద్దులుచెప్పేవారు
దొంతులు నే నంటఁగాక తొలఁగున్న వేళను
(॥ఇందు॥)
దగ్గరియుండఁగల్గెఁగా తగినచుట్టాలు నీకు
సిగ్గువడి నేఁ దలవంచినవేళను
ఆగ్గమై శ్రీవేంకటేశ ఆదరించి కూడితివి
వొగ్గి నేఁ బానుపుమీఁద వొంటినున్న వేళను
(||pallavi||)
iṁdune badugavayya yinnāḽlagainā nīvu
kaṁduva gaṁṭivigā yikkaḍanunnaveḽanu
(||iṁdu||)
muchchaḍām̐ḍa galigĕm̐gā mudida nīgŏkkadainā
kĕchchurem̐gi nādonaliginaveḽanu
vachchibom̐galigirigā vāgiḍigi vāḍavāru
nachchugŏṭṭi ninnu ne manasu sūseveḽanu
(||iṁdu||)
yiṁta navvam̐galigĕm̐gā yirugu pŏrugu nīgu
sĕṁtala nī ninnu sādiṁcheveḽanu
pŏṁtane kaligirigā buddulusĕppevāru
dŏṁtulu ne naṁṭam̐gāga tŏlam̐gunna veḽanu
(||iṁdu||)
daggariyuṁḍam̐galgĕm̐gā taginasuṭṭālu nīgu
sigguvaḍi nem̐ dalavaṁchinaveḽanu
āggamai śhrīveṁkaḍeśha ādariṁchi kūḍidivi
vŏggi nem̐ bānubumīm̐da vŏṁṭinunna veḽanu