ఇందుఁగల పస యెల్ల యింతే నుండీ
(॥పల్లవి॥)
ఇందుఁగల పస యెల్ల యింతే నుండీ
బొందితోనే హరిఁ గొల్చి పొడ వెక్కరో
(॥ఇందు॥)
లోపలికి వెలికిని లోఁగి యెడ తాఁకేటి
పూపెల ముక్కుకన వుసు రింతే తనవు
రూపులేని ప్రాయపు రుచి చిక్కి బ్రతికేటి
పైపూత వయసునఁ బచ్చియైన తనువు
(॥ఇందు॥)
నిచ్చలు మాపు రేపు నిదిరించి మేలుకొంటి
దిచ్చరి చావుఁ బుట్టు తెలిపె తనువు
తచ్చి మలమూత్రముల దాఁ పరపు పుట్టినిట్లు
ఆచ్చపు హేయములచే అంటరానితనువు
(॥ఇందు॥)
తుంచి సగ మటు వొంగ తోడనే లోనికి వచ్చు
పంచి లోనికి వెలికీ ప్రాణ మొక్కటి
కొంచక శ్రీ వేంకటేశుఁ గొల్చి నేను శరణంటి
మంచిదాయె పను లెల్లా మమ్ముఁ గాచె నితఁడూ
(||pallavi||)
iṁdum̐gala pasa yĕlla yiṁte nuṁḍī
bŏṁdidone harim̐ gŏlsi pŏḍa vĕkkaro
(||iṁdu||)
lobaligi vĕligini lom̐gi yĕḍa tām̐keḍi
pūbĕla mukkugana vusu riṁte tanavu
rūbuleni prāyabu rusi sikki bradigeḍi
paibūda vayasunam̐ bachchiyaina tanuvu
(||iṁdu||)
nichchalu mābu rebu nidiriṁchi melugŏṁṭi
dichchari sāvum̐ buṭṭu tĕlibĕ tanuvu
tachchi malamūtramula dām̐ parabu puṭṭiniṭlu
āchchabu heyamulase aṁṭarānidanuvu
(||iṁdu||)
tuṁchi saga maḍu vŏṁga toḍane lonigi vachchu
paṁchi lonigi vĕligī prāṇa mŏkkaḍi
kŏṁchaga śhrī veṁkaḍeśhum̐ gŏlsi nenu śharaṇaṁṭi
maṁchidāyĕ panu lĕllā mammum̐ gāsĕ nidam̐ḍū