ఇందుమీఁద సతిభావ మెట్లౌనో యేమౌనో
(॥పల్లవి॥)
ఇందుమీఁద సతిభావ మెట్లౌనో యేమౌనో
విందుగాఁ జెలువునికి విన్నవించరే
(॥ఇందు॥)
కోవిలకూఁతకుఁగానే గుండె జల్లురని చెలి
పూవకపూచినయట్టు పులకించె
మావినుండి యంతలోనే మదనభూతము సోఁకె
పోవులైనపుప్పొడినే పోయరే బడిమి
(॥ఇందు॥)
కోమలి చందురుఁడనే కొరవిదయ్యముఁ జూచి
దీమస మింతయు మాని దిగులందెను
తేమలైనవెన్నెలల దిమ్మువట్టి నిలువున
మైమఱచెఁ గప్పురాన మంత్రించరే
(॥ఇందు॥)
ఇంతలో శ్రీవేంకటేశుఁ డిందుకు విచ్చేయఁగాను
చింతదీర మేనెల్లఁ జెమరించెను
వింతలైనరతులలో విరహపుసోఁకు వాసె
కంతుచిగురాకురక్ష గట్టరే యంగనకు
(||pallavi||)
iṁdumīm̐da sadibhāva mĕṭlauno yemauno
viṁdugām̐ jĕluvunigi vinnaviṁchare
(||iṁdu||)
kovilagūm̐tagum̐gāne guṁḍĕ jallurani sĕli
pūvagabūsinayaṭṭu pulagiṁchĕ
māvinuṁḍi yaṁtalone madanabhūdamu som̐kĕ
povulainabuppŏḍine poyare baḍimi
(||iṁdu||)
komali saṁdurum̐ḍane kŏravidayyamum̐ jūsi
dīmasa miṁtayu māni digulaṁdĕnu
temalainavĕnnĕlala dimmuvaṭṭi niluvuna
maimaṟasĕm̐ gappurāna maṁtriṁchare
(||iṁdu||)
iṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍiṁdugu vichcheyam̐gānu
siṁtadīra menĕllam̐ jĕmariṁchĕnu
viṁtalainaradulalo virahabusom̐ku vāsĕ
kaṁtusigurāgurakṣha gaṭṭare yaṁganagu