Imdumeemda manamaada limpu layyeenaa

ఇందుమీఁద మనమాట లింపు లయ్యీనా
Language

(॥పల్లవి॥)
ఇందుమీఁద మనమాట లింపు లయ్యీనా
డిందుపడఁ బతిఁ దోడి తెత్తము రారే

(॥ఇందు॥)
మాటలెంత వేసటో మగువ చెలులతోడ
గాఁటపుఁ బెదవులే కదలించీని
నీటున విభుఁడు దానినెగులెల్లా నొకమాఁటే
కూటువగాఁ జెమటలు గుమ్మరించీని

(॥ఇందు॥)
నవ్వు లెంతబరువో నాతోడసైతమును
జవ్వని సెలవులనే జారఁ దోసీని
యివ్వల మరునిమీఁది యీసులెల్లాఁ దనకొప్పు
పువ్వులమీఁదటఁ జూపి పూఁచి దులిపీని

(॥ఇందు॥)
చూపు లెంతవేసటో సొరిది నద్దము చూడ
నోపనంటాఁ దలవంచి వూరకున్నది
యీపొద్దు శ్రీవేంకటేశుఁ డింతలోఁ గూడినందుకు
తీవుల పెదవులనే ద్రిష్టము చూపీని

(||pallavi||)
iṁdumīm̐da manamāḍa liṁpu layyīnā
ḍiṁdubaḍam̐ badim̐ doḍi tĕttamu rāre

(||iṁdu||)
māḍalĕṁta vesaḍo maguva sĕluladoḍa
gām̐ṭabum̐ bĕdavule kadaliṁchīni
nīḍuna vibhum̐ḍu dāninĕgulĕllā nŏgamām̐ṭe
kūḍuvagām̐ jĕmaḍalu gummariṁchīni

(||iṁdu||)
navvu lĕṁtabaruvo nādoḍasaidamunu
javvani sĕlavulane jāram̐ dosīni
yivvala marunimīm̐di yīsulĕllām̐ danagŏppu
puvvulamīm̐daḍam̐ jūbi pūm̐si dulibīni

(||iṁdu||)
sūbu lĕṁtavesaḍo sŏridi naddamu sūḍa
nobanaṁṭām̐ dalavaṁchi vūragunnadi
yībŏddu śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐ gūḍinaṁdugu
tīvula pĕdavulane driṣhṭamu sūbīni