ఇందులోనె వున్నదిదె యింతి తమకములేల
(॥పల్లవి॥)
ఇందులోనె వున్నదిదె యింతి తమకములేల
గొందినే కోరికలెల్లా కొమ్ములే కిగిర్చెను
(॥ఇందు॥)
చెలి నీకడకు రాఁగా చెమటలఁ దొప్పఁదోఁగె
వలపులు వానలేనివరదాయను
ఎలమి నీరాకల కెదురులు చూడఁగాను
వెలయఁగ దీవె లేకే వెలుఁగు గాన్పించెను
(॥ఇందు॥)
వెదకుతానే నిన్నువెలఁది కాఁకలఁ బొందె
యెదుటఁ బొద్దువొడవకెండ గాసెను
ఇదె నీపై యాసలనిట్టె మేను పలకరించె
వెదవెట్టుక ససులు వేవేలు మొలచెను
(॥ఇందు॥)
నీరతికిఁ జేయి చాఁచి నిట్టూర్పుల నిండెఁ జెలి
కోరి యాస గాలిలేక తూరుపెత్తెను
సారె శ్రీ వెంకటేశుఁడ చన్నుల నిన్నునొత్తి
బోరునఁదా జాళెలేని బొమ్మరాలువేసెను
(||pallavi||)
iṁdulonĕ vunnadidĕ yiṁti tamagamulela
gŏṁdine korigalĕllā kŏmmule kigirsĕnu
(||iṁdu||)
sĕli nīgaḍagu rām̐gā sĕmaḍalam̐ dŏppam̐dom̐gĕ
valabulu vānalenivaradāyanu
ĕlami nīrāgala kĕdurulu sūḍam̐gānu
vĕlayam̐ga dīvĕ lege vĕlum̐gu gānpiṁchĕnu
(||iṁdu||)
vĕdagudāne ninnuvĕlam̐di kām̐kalam̐ bŏṁdĕ
yĕduḍam̐ bŏdduvŏḍavagĕṁḍa gāsĕnu
idĕ nībai yāsalaniṭṭĕ menu palagariṁchĕ
vĕdavĕṭṭuga sasulu vevelu mŏlasĕnu
(||iṁdu||)
nīradigim̐ jeyi sām̐si niṭṭūrbula niṁḍĕm̐ jĕli
kori yāsa gālilega tūrubĕttĕnu
sārĕ śhrī vĕṁkaḍeśhum̐ḍa sannula ninnunŏtti
borunam̐dā jāḽĕleni bŏmmarāluvesĕnu