ఇందులోనే వున్నది మీ యిద్దరి జాణతనము
(॥పల్లవి॥)
ఇందులోనే వున్నది మీ యిద్దరి జాణతనము
అందరము నేమని యాడేము నిన్నును
(॥॥)
బాగాలిచ్చేయాఁటదానిపయ్యదకొం గెడలించి
చేఁగదేరేచన్నులు పిసికేవేమయ్యా
ఆగడీఁడవని నిన్ను నౌఁగాదనఁగలేక
సోగకన్నులఁదప్పక చూచెనాపెనిన్నును
(॥॥)
కుంచేవేసేమగువను కొప్పువట్టి తీసిమోవి-
యంచు గంటిసేసితి వౌనయ్యా
వంచఁకుఁడ వనుచు రవ్వలుగాఁ జేయఁగలేక
ముంచినమొగమోటాన మొక్కినవ్వీ నిన్నును
(॥॥)
సురటివిసరేయింతిఁ జొక్కించి కాఁగిటఁ గూడి
కెరలించేవు సిగ్గు చెక్కిట నేమయ్యా
పొరపొచ్చెగాఁడవని పోరక శ్రీ వేంకటేశ
సరినిక్కి పై నొరగి యాసలఁబెట్టీ నిన్నును
(||pallavi||)
iṁdulone vunnadi mī yiddari jāṇadanamu
aṁdaramu nemani yāḍemu ninnunu
(||||)
bāgālichcheyām̐ṭadānibayyadagŏṁ gĕḍaliṁchi
sem̐gaderesannulu pisigevemayyā
āgaḍīm̐ḍavani ninnu naum̐gādanam̐galega
sogagannulam̐dappaga sūsĕnābĕninnunu
(||||)
kuṁchevesemaguvanu kŏppuvaṭṭi tīsimovi-
yaṁchu gaṁṭisesidi vaunayyā
vaṁcham̐kum̐ḍa vanusu ravvalugām̐ jeyam̐galega
muṁchinamŏgamoḍāna mŏkkinavvī ninnunu
(||||)
suraḍivisareyiṁtim̐ jŏkkiṁchi kām̐giḍam̐ gūḍi
kĕraliṁchevu siggu sĕkkiḍa nemayyā
pŏrabŏchchĕgām̐ḍavani poraga śhrī veṁkaḍeśha
sarinikki pai nŏragi yāsalam̐bĕṭṭī ninnunu