Imdulone nee pamtamemi dappenu

ఇందులోనే నీ పంతమేమి దప్పెను
Language

(॥పల్లవి॥)
ఇందులోనే నీ పంతమేమి దప్పెను
చెంది వినయములెల్లాఁ జేయరాదా యిఁకను

(॥ఇందు॥)
కప్పురగంది నిన్నుఁ గంటేనే తిట్టునని
అప్పుడే యీమాట నీతోనాడనా నేను
చెప్పరానిచేఁతెలెల్లాఁ జేసినవాఁడవు నీవు
ముప్పిరి మంచిమాటాడి మొక్కరాదా యిఁకను

(॥ఇందు॥)
అంగన నీవు మాటలాడితేఁ గోపించునని
సంగతిగాఁ జూపి మోపి చాట నా నేను
అంగడిసతులనెల్లా నంటినవాఁడవు నీవు
చెంగక ప్రియములెల్లాఁ జెప్పరాదా ఇఁకను

(॥ఇందు॥)
నెలఁత నీవు గూడితేను నిన్నునిట్టె మెచ్చునని
వెలయనిప్పుడేవిన్నవించనా నేను
చెలులు పదారువేల శ్రీవేంకటేశుఁడవు
కలసితివి నీకొంగు గప్పరాదా యిఁకను

(||pallavi||)
iṁdulone nī paṁtamemi dappĕnu
sĕṁdi vinayamulĕllām̐ jeyarādā yim̐kanu

(||iṁdu||)
kappuragaṁdi ninnum̐ gaṁṭene tiṭṭunani
appuḍe yīmāḍa nīdonāḍanā nenu
sĕpparānisem̐tĕlĕllām̐ jesinavām̐ḍavu nīvu
muppiri maṁchimāḍāḍi mŏkkarādā yim̐kanu

(||iṁdu||)
aṁgana nīvu māḍalāḍidem̐ gobiṁchunani
saṁgadigām̐ jūbi mobi sāḍa nā nenu
aṁgaḍisadulanĕllā naṁṭinavām̐ḍavu nīvu
sĕṁgaga priyamulĕllām̐ jĕpparādā im̐kanu

(||iṁdu||)
nĕlam̐ta nīvu gūḍidenu ninnuniṭṭĕ mĕchchunani
vĕlayanippuḍevinnaviṁchanā nenu
sĕlulu padāruvela śhrīveṁkaḍeśhum̐ḍavu
kalasidivi nīgŏṁgu gapparādā yim̐kanu