Imdulo nenoo nokkade nemta ledu

ఇందులో నేనూ నొక్కతె నెంత లేదు
Language

(॥పల్లవి॥)
ఇందులో నేనూ నొక్కతె నెంత లేదు
సందడి వలపు నాపైఁ జల్లఁగా నేమాయను

(॥ఇందు॥)
యెంత నీ వాదరించినా నెగక్కెమౌఁ గాని
అంతరంగమున నిజమని పట్టదు
యింతుల నందరిని నీ విట్టె నమ్మించేది
సంతతము నలవాటు సారే నీకుఁ గలదు

(॥ఇందు॥)
సరసము నీ వాడితే జగడమై తోఁచుఁగాని
కరుణించేవని యిచ్చకము వుట్టదు
తరుణుల కిందరికి తమి యిట్టె రేఁచేది
సరికి బేసికి నీకు సహజమే యెపుడు

(॥ఇందు॥)
గక్కన శ్రీవేంకటేశ కాఁగిట నన్నుఁ గూడితిఁ
వక్కరతో నాకు నిది యరుదు గాదు
అక్కడ నెందైన నీకు నతివలఁ గూడేది
తొక్కి నీతఁ దొల్లే వెన్నతోఁ బెట్టిన గుణము

(||pallavi||)
iṁdulo nenū nŏkkadĕ nĕṁta ledu
saṁdaḍi valabu nābaim̐ jallam̐gā nemāyanu

(||iṁdu||)
yĕṁta nī vādariṁchinā nĕgakkĕmaum̐ gāni
aṁtaraṁgamuna nijamani paṭṭadu
yiṁtula naṁdarini nī viṭṭĕ nammiṁchedi
saṁtadamu nalavāḍu sāre nīgum̐ galadu

(||iṁdu||)
sarasamu nī vāḍide jagaḍamai tom̐sum̐gāni
karuṇiṁchevani yichchagamu vuṭṭadu
taruṇula kiṁdarigi tami yiṭṭĕ rem̐sedi
sarigi besigi nīgu sahajame yĕbuḍu

(||iṁdu||)
gakkana śhrīveṁkaḍeśha kām̐giḍa nannum̐ gūḍidim̐
vakkarado nāgu nidi yarudu gādu
akkaḍa nĕṁdaina nīgu nadivalam̐ gūḍedi
tŏkki nīdam̐ dŏlle vĕnnadom̐ bĕṭṭina guṇamu