Imdulo ne nevvamdanu yemchi ninnum bogadamga

ఇందులో నే నెవ్వఁడను యెంచి నిన్నుఁ బొగడఁగ
Language

(॥పల్లవి॥)
ఇందులో నే నెవ్వఁడను యెంచి నిన్నుఁ బొగడఁగ
కందువ యింతంతని కానరాదు మహిమ

(॥ఇందు॥)
యేచి నీ రోమరంధ్రాల నిటువంటి బ్రహ్మాండకోట్లు
కాచినట్లున్నవి నీ కాయమునందు
వూచిన నీ బొడ్డుఁదమ్మి బుట్టిన బహ్మ లెందరో
చేచేత రుద్రు లెందరో చెప్పరాదు మహిమ

(॥ఇందు॥)
నారువోసినట్లాను నానాదేవకోట్లు
కారుకమ్మీ నిదెనీ సంకల్పమునందు
యీరీతి మును లెందరో యిక వేదరాసు లెన్నో
చేరన జీవు లెందరో చెప్పరాదు మహిమ

(॥ఇందు॥)
అనలులుఁ జంద్రులు నాదిత్యకోట్లు
జనియింపుచున్నవి నీ జలజాక్షుల
యెనయి శ్రీ వేంకటేశ యిన్నిటా నీ దాసుఁడను
చెనక నలవి గాదు చెప్పరాదు మహిమ

(||pallavi||)
iṁdulo ne nĕvvam̐ḍanu yĕṁchi ninnum̐ bŏgaḍam̐ga
kaṁduva yiṁtaṁtani kānarādu mahima

(||iṁdu||)
yesi nī romaraṁdhrāla niḍuvaṁṭi brahmāṁḍagoṭlu
kāsinaṭlunnavi nī kāyamunaṁdu
vūsina nī bŏḍḍum̐dammi buṭṭina bahma lĕṁdaro
seseda rudru lĕṁdaro sĕpparādu mahima

(||iṁdu||)
nāruvosinaṭlānu nānādevagoṭlu
kārugammī nidĕnī saṁkalbamunaṁdu
yīrīdi munu lĕṁdaro yiga vedarāsu lĕnno
serana jīvu lĕṁdaro sĕpparādu mahima

(||iṁdu||)
analulum̐ jaṁdrulu nādityagoṭlu
janiyiṁpusunnavi nī jalajākṣhula
yĕnayi śhrī veṁkaḍeśha yinniḍā nī dāsum̐ḍanu
sĕnaga nalavi gādu sĕpparādu mahima