Imdulo ne nevvamdano yememi sesidino

ఇందులో నే నెవ్వఁడనో యేమేమి సేసితినో
Language

(॥పల్లవి॥)
ఇందులో నే నెవ్వఁడనో యేమేమి సేసితినో
ముందు వెనుక లెఱుఁగ మురహర కావవే

(॥ఇందు॥)
పరదూషకునకు పరమనాస్తికునకు
కరుణ లేనివానికి గతి లేదని యందురు
సరవిఁ గ్రూరునకు సంశయచిత్తునకు
దురితవర్తనునకు దుర్గతియె యందురు

(॥ఇందు॥)
అతినిష్టూరభాషికి నన్యకాంతాలోలునకు
యితరాసూయపరున కిహమే లేదని యందురు
పతితుం డైనవానికి బ్రహ్మణనిందకునకును
తతి ననాచారికిని దైవము లేఁడని యందురు

(॥ఇందు॥)
అనృతవాదికిని అర్థచోరకునకు
ఘనహింసకునకు లోకము లేదని యందురు
విని నే నిందులకుఁగా వెఱచి నీకు శరణంటిని
వెనక వేసుకొని శ్రీవేంకటేశ యేలవే

(||pallavi||)
iṁdulo ne nĕvvam̐ḍano yememi sesidino
muṁdu vĕnuga lĕṟum̐ga murahara kāvave

(||iṁdu||)
paradūṣhagunagu paramanāstigunagu
karuṇa lenivānigi gadi ledani yaṁduru
saravim̐ grūrunagu saṁśhayasittunagu
duridavardanunagu durgadiyĕ yaṁduru

(||iṁdu||)
adiniṣhṭūrabhāṣhigi nanyagāṁtālolunagu
yidarāsūyabaruna kihame ledani yaṁduru
padiduṁ ḍainavānigi brahmaṇaniṁdagunagunu
tadi nanāsārigini daivamu lem̐ḍani yaṁduru

(||iṁdu||)
anṛtavādigini ardhasoragunagu
ghanahiṁsagunagu logamu ledani yaṁduru
vini ne niṁdulagum̐gā vĕṟasi nīgu śharaṇaṁṭini
vĕnaga vesugŏni śhrīveṁkaḍeśha yelave