ఇందులో మొదలికర్త యెవ్వఁడు లేఁడు గాఁబోలు
(॥పల్లవి॥)
ఇందులో మొదలికర్త యెవ్వఁడు లేఁడు గాఁబోలు
ముందు కరివరదుఁడే ముఖ్యుఁడు గాఁబోలు
(॥ఇందు॥)
ఆడితిఁబో బహురూపా లన్నియోనులఁ బుట్టి
తోడనె బ్రహ్మాదులనే దొరలెదుటా
జాడలు మెచ్చాలేరు చాలునన్నవారులేరు
వేడుక నడవిఁగాసే వెన్నెలాయ బ్రదుకు
(॥ఇందు॥)
అన్నికర్మములుఁ జేసి ఆటలో బ్రాహ్మణుఁడనైతిఁ-
నన్ని వేదములనేటి యంగడివీధి
నన్నుఁ జూచేవారు లేరు నవ్వేటివారు లేరు
వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు
(॥ఇందు॥)
సంసారపునాటకసాలలో ప్రతిమనైతి
కంసారి శ్రీవేంకటపతి మాయలోన
యింస లిన్నియుఁ దేరె నిందరుఁ జుట్టములైరి
హంసచేతి పాలునీరునట్లాయ బ్రదుకు
(||pallavi||)
iṁdulo mŏdaligarda yĕvvam̐ḍu lem̐ḍu gām̐bolu
muṁdu karivaradum̐ḍe mukhyum̐ḍu gām̐bolu
(||iṁdu||)
āḍidim̐bo bahurūbā lanniyonulam̐ buṭṭi
toḍanĕ brahmādulane dŏralĕduḍā
jāḍalu mĕchchāleru sālunannavāruleru
veḍuga naḍavim̐gāse vĕnnĕlāya bradugu
(||iṁdu||)
annigarmamulum̐ jesi āḍalo brāhmaṇum̐ḍanaidim̐-
nanni vedamulaneḍi yaṁgaḍivīdhi
nannum̐ jūsevāru leru navveḍivāru leru
vannĕlasamudramulo vānalāya bradugu
(||iṁdu||)
saṁsārabunāḍagasālalo pradimanaidi
kaṁsāri śhrīveṁkaḍabadi māyalona
yiṁsa linniyum̐ derĕ niṁdarum̐ juṭṭamulairi
haṁsasedi pālunīrunaṭlāya bradugu