Imdulage veragayyee nichchada naagu

ఇందులకే వెరగయ్యీ నిచ్చట నాకు
Language

(॥పల్లవి॥)
ఇందులకే వెరగయ్యీ నిచ్చట నాకు
చెంది నాపై బత్తు వీడఁ జేసీనే తాను

(॥ఇందు॥)
చెక్కులచెమటతోనే చెదరినకొప్పుతోనే
యెక్కడనుండి వచ్చీనే యిపుడు తాను
పుక్కిట తమ్మతోనే కొంత నిట్టూర్పులతోనే
ఇక్కువ లేలంటీనే యిదివో తాను

(॥ఇందు॥)
చిప్పిలుఁ గళలతోనే చిట్లుగందాలతోనే
తప్పక యేమి చూచినీ తగిలి తాను
కప్పినరెంటెముతోనే కరఁగుజవ్వాదితోనే
ఆప్పటి నన్నెంత చేరి నదివొ తాను

(॥ఇందు॥)
చిమ్ముఁ జెనకులతోనే చిగురుసిగ్గులతోనే
యెమ్మె లెట్టు చూపీనే యెదుటఁ దాను
అమ్మరో శ్రీవేంకటేశుఁ డట్టె వచ్చి నన్నుఁ గూడె
పిమ్మట నెన్ని చెప్పీనే ప్రియాలు తాను

(||pallavi||)
iṁdulage vĕragayyī nichchaḍa nāgu
sĕṁdi nābai battu vīḍam̐ jesīne tānu

(||iṁdu||)
sĕkkulasĕmaḍadone sĕdarinagŏppudone
yĕkkaḍanuṁḍi vachchīne yibuḍu tānu
pukkiḍa tammadone kŏṁta niṭṭūrbuladone
ikkuva lelaṁṭīne yidivo tānu

(||iṁdu||)
sippilum̐ gaḽaladone siṭlugaṁdāladone
tappaga yemi sūsinī tagili tānu
kappinarĕṁṭĕmudone karam̐gujavvādidone
āppaḍi nannĕṁta seri nadivŏ tānu

(||iṁdu||)
simmum̐ jĕnaguladone sigurusigguladone
yĕmmĕ lĕṭṭu sūbīne yĕduḍam̐ dānu
ammaro śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ vachchi nannum̐ gūḍĕ
pimmaḍa nĕnni sĕppīne priyālu tānu