Imdugumgaam gosa rimkanelaa

ఇందుకుఁగాఁ గొస రిఁకనేలా
Language

(॥పల్లవి॥)
ఇందుకుఁగాఁ గొస రిఁకనేలా
చెంది నీ పనుపు సేసేమయ్యా

(॥ఇందు॥)
పలుమారు నీతో బంతములాడఁగఁ
గలిగినవలపులకసి వోదు
చలమున నీతో జంకించఁగా
తలఁచినతలఁపులతహతహ వోదు

(॥ఇందు॥)
వట్టికోపమున వాదులడువఁగా
వెట్టికి నెంజెరివియుఁ బోదు
దట్టించి నిన్నును తగవులఁ బెట్టిన
పట్టినసూడునుఁ బాడునుఁ బోదు

(॥ఇందు॥)
పేరుకొనుచు నినుఁ బెదవులఁ దిట్టిన
ఆరీతికాఁతాళ మటు వోదు
యీరీతి శ్రీవేంకటేశ కూడితివి
నేరుపు నేరమి నీకే పోదు

(||pallavi||)
iṁdugum̐gām̐ gŏsa rim̐kanelā
sĕṁdi nī panubu sesemayyā

(||iṁdu||)
palumāru nīdo baṁtamulāḍam̐gam̐
galiginavalabulagasi vodu
salamuna nīdo jaṁkiṁcham̐gā
talam̐sinadalam̐puladahadaha vodu

(||iṁdu||)
vaṭṭigobamuna vādulaḍuvam̐gā
vĕṭṭigi nĕṁjĕriviyum̐ bodu
daṭṭiṁchi ninnunu tagavulam̐ bĕṭṭina
paṭṭinasūḍunum̐ bāḍunum̐ bodu

(||iṁdu||)
perugŏnusu ninum̐ bĕdavulam̐ diṭṭina
ārīdigām̐tāḽa maḍu vodu
yīrīdi śhrīveṁkaḍeśha kūḍidivi
nerubu nerami nīge podu