Imdugumgaam gobimcha nela neegu

ఇందుకుఁగాఁ గోపించ నేల నీకు
Language

(॥పల్లవి॥)
ఇందుకుఁగాఁ గోపించ నేల నీకు
ముందుగల కోపమెల్లా ముగిసెఁ బోరా

(॥ఇందుకు॥)
కొమ్మ నీ కుచము లివి కొనవాండ్లా యింత
యెమ్మె లేల నీకునందు కేమి వోదురా
అమ్ముడు జక్కనలంటా నడిగితినే వోరి
కమ్మర మానవు నే మంగడివారమా

(॥ఇందుకు॥)
పొలఁతి నీ మోవిపండు పుల్లనో తీపో వోరి
తొలరా నీ కే లందుతోడి చింత
వెలవెట్టె యందు కేమి వెఱపాయనా నీకు
వలపుగంపల నమ్మ వచ్చితినా నేను

(॥ఇందుకు॥)
వనిత నా కౌఁగిలి వదలకువే యిట్టె
తనిసితి మిద్దరికిఁ దగులాయను
వినవె శ్రీవేంకటవిభుఁడ నేను అన్నిఁ
గనుఁగొంటి నిఁక నేమి కడ మాయరా

(||pallavi||)
iṁdugum̐gām̐ gobiṁcha nela nīgu
muṁdugala kobamĕllā mugisĕm̐ borā

(||iṁdugu||)
kŏmma nī kusamu livi kŏnavāṁḍlā yiṁta
yĕmmĕ lela nīgunaṁdu kemi vodurā
ammuḍu jakkanalaṁṭā naḍigidine vori
kammara mānavu ne maṁgaḍivāramā

(||iṁdugu||)
pŏlam̐ti nī movibaṁḍu pullano tībo vori
tŏlarā nī ke laṁdudoḍi siṁta
vĕlavĕṭṭĕ yaṁdu kemi vĕṟabāyanā nīgu
valabugaṁpala namma vachchidinā nenu

(||iṁdugu||)
vanida nā kaum̐gili vadalaguve yiṭṭĕ
tanisidi middarigim̐ dagulāyanu
vinavĕ śhrīveṁkaḍavibhum̐ḍa nenu annim̐
ganum̐gŏṁṭi nim̐ka nemi kaḍa māyarā