Imdugumgaam damagimcha nemtigi maagu

ఇందుకుఁగాఁ దమకించ నేఁటికి మాకు
Language

(॥పల్లవి॥)
ఇందుకుఁగాఁ దమకించ నేఁటికి మాకు
అందెందె తనిసితిమి అల్లనాఁడే నేము

(॥ఇందు॥)
ప్రియమెంత చెప్పినాను పెడరేఁచి యేమనిన
నియతముగ వినేవి నీచెవులే కా
క్రియ యెంత దెలిపిన కేలెంత చాఁచినాను
నయమిచ్చి తెమలేమనసు నీదే కా

(॥ఇందు॥)
మొక్కులెన్ని మొక్కినానుముందరనెంతవుండినా
గక్కనఁ జూచేవి నీకన్నులివే కా
పక్కన నెట్టు నవ్వినా బాఁతిపడి పైకొనిన
గుక్కక కరఁగేది నీ గుండె యింతే కా

(॥ఇందు॥)
పచ్చిగా నేమిసేసిన పసగా నెంత కూడిన
యిచ్చగించి లోనయ్యేది యీతనువే కా
అచ్చమై శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి
మెచ్చి యెంత పొగడినా మేలు నీదే కా

(||pallavi||)
iṁdugum̐gām̐ damagiṁcha nem̐ṭigi māgu
aṁdĕṁdĕ tanisidimi allanām̐ḍe nemu

(||iṁdu||)
priyamĕṁta sĕppinānu pĕḍarem̐si yemanina
niyadamuga vinevi nīsĕvule kā
kriya yĕṁta dĕlibina kelĕṁta sām̐sinānu
nayamichchi tĕmalemanasu nīde kā

(||iṁdu||)
mŏkkulĕnni mŏkkinānumuṁdaranĕṁtavuṁḍinā
gakkanam̐ jūsevi nīgannulive kā
pakkana nĕṭṭu navvinā bām̐tibaḍi paigŏnina
gukkaga karam̐gedi nī guṁḍĕ yiṁte kā

(||iṁdu||)
pachchigā nemisesina pasagā nĕṁta kūḍina
yichchagiṁchi lonayyedi yīdanuve kā
achchamai śhrīveṁkaḍeśha aṁtalo nannelidivi
mĕchchi yĕṁta pŏgaḍinā melu nīde kā