Imdugumgaa vatti vaadu limka needo nelayya

ఇందుకుఁగా వట్టి వాదు లిఁక నీతో నేలయ్య
Language

(॥పల్లవి॥)
ఇందుకుఁగా వట్టి వాదు లిఁక నీతో నేలయ్య
పొందు లెల్లఁ జేకొంటిమి పొద్దున రావయ్యా

(॥ఇందుకు॥)
నీచేత మాటలకు నీకన్నుల తేటలకు
యేచి లోనైనవారికి నేల కోపము
పూచినట్టె వుండుఁ గాని పున్నమినాఁటివెన్నెల
చూచితేఁ బువ్వులు లేవు సోద్య మింతే కాని

(॥ఇందుకు॥)
సేసేటి నీ మేకులకు సెలవుల నవ్వులకు
ఆసపడ్డవారము మా కలు కేఁటికి
పూసినట్లనె వుండు పుప్పొడి పై రాలితేను
వోసరి గందమువలె వొళ్ల నేమ నంటదు

(॥ఇందుకు॥)
నిక్కపు నీ సేసలకు నిండిన నీ కాఁగిటికి
చిక్కినవారము మాకు చింత లేటికి
యిక్కువ శ్రీవెంకటేశ యేక మైతివి వలపు
లెక్కకు వచ్చినట్టుండు లేదు మితి మేరా

(||pallavi||)
iṁdugum̐gā vaṭṭi vādu lim̐ka nīdo nelayya
pŏṁdu lĕllam̐ jegŏṁṭimi pŏdduna rāvayyā

(||iṁdugu||)
nīseda māḍalagu nīgannula teḍalagu
yesi lonainavārigi nela kobamu
pūsinaṭṭĕ vuṁḍum̐ gāni punnaminām̐ṭivĕnnĕla
sūsidem̐ buvvulu levu sodya miṁte kāni

(||iṁdugu||)
seseḍi nī megulagu sĕlavula navvulagu
āsabaḍḍavāramu mā kalu kem̐ṭigi
pūsinaṭlanĕ vuṁḍu puppŏḍi pai rālidenu
vosari gaṁdamuvalĕ vŏḽla nema naṁṭadu

(||iṁdugu||)
nikkabu nī sesalagu niṁḍina nī kām̐giḍigi
sikkinavāramu māgu siṁta leḍigi
yikkuva śhrīvĕṁkaḍeśha yega maidivi valabu
lĕkkagu vachchinaṭṭuṁḍu ledu midi merā