ఇందుకుఁగా నేమన్నా నెరవు తాను
(॥పల్లవి॥)
ఇందుకుఁగా నేమన్నా నెరవు తాను
ఇందరు నీ తారుకాణ లెఱఁగనివా
(॥ఇందు॥)
వొల్లనిసతులమాట వొప్పులునుఁ దప్పులవు
చల్లనిచూపులయినచల్ల వేఁడవు
చెల్లుబడి నిచ్చకపుఁజేఁతలెల్ల మోఁత లవును
యెల్లవారు వివియెల్ల నెఱఁగనివా
(॥ఇందు॥)
మనసెనయనిచోట మక్కువలే తక్కువలౌ
తనివోనినవ్వులు తాపము లవును
చనివిచ్చి చెనకినవరసాలు విరసాలౌ -
నెనయవియీభావా లెఱఁగనివా
(॥ఇందు॥)
కూరిమిలేనిచోట కొసరులే కసరులౌ
కోరి చేకొనిన నివే కూటములౌ
వేరులేక కలసె శ్రీవేంకటేశుఁడిదె నన్ను
యీరీతి నింతులెల్లా నెఱఁగనివా
(||pallavi||)
iṁdugum̐gā nemannā nĕravu tānu
iṁdaru nī tārugāṇa lĕṟam̐ganivā
(||iṁdu||)
vŏllanisadulamāḍa vŏppulunum̐ dappulavu
sallanisūbulayinasalla vem̐ḍavu
sĕllubaḍi nichchagabum̐jem̐talĕlla mom̐ta lavunu
yĕllavāru viviyĕlla nĕṟam̐ganivā
(||iṁdu||)
manasĕnayanisoḍa makkuvale takkuvalau
tanivoninavvulu tābamu lavunu
sanivichchi sĕnaginavarasālu virasālau -
nĕnayaviyībhāvā lĕṟam̐ganivā
(||iṁdu||)
kūrimilenisoḍa kŏsarule kasarulau
kori segŏnina nive kūḍamulau
verulega kalasĕ śhrīveṁkaḍeśhum̐ḍidĕ nannu
yīrīdi niṁtulĕllā nĕṟam̐ganivā