ఇందుకుఁగా నెగ్గు దప్పు లెంచకువయ్యా
(॥పల్లవి॥)
ఇందుకుఁగా నెగ్గు దప్పు లెంచకువయ్యా
సందడించీ నా మోహము జంటలై యీరీతిని
(॥ఇందు॥)
విన్నవించే నా మాటలు వినయ మెంత చూపినా
కన్నులచూపులై నిన్నుఁ గాఁడి పారీని
పన్నుక నా నుదురు నీ పాదాలకు మొక్కినాను
నిన్ను నా చక్కఁదనము నివ్వెరగందించీని
(॥ఇందు॥)
సారె నా చేతులు నీతో సరసము లాడినాను
వారక నాగోళ్ళు నీపై వాఁడిమీరీని
నేరుపుతో నా సెలవి నీతో నెంత నవ్వినాను
కూరిమి నా పెదవులు కొసరింపిచీని
(॥ఇందు॥)
పుడమి నా కాఁగిలి నీ పొందు లెంత సేసినాను
వడిఁ జన్నులు కొండలవలె నొత్తీని
యెడయక శ్రీవేంకటేశ నీ దేవులనైతి
వుడివోనిరతులు నిన్నుబ్బురేఁచీని
(||pallavi||)
iṁdugum̐gā nĕggu dappu lĕṁchaguvayyā
saṁdaḍiṁchī nā mohamu jaṁṭalai yīrīdini
(||iṁdu||)
vinnaviṁche nā māḍalu vinaya mĕṁta sūbinā
kannulasūbulai ninnum̐ gām̐ḍi pārīni
pannuga nā nuduru nī pādālagu mŏkkinānu
ninnu nā sakkam̐danamu nivvĕragaṁdiṁchīni
(||iṁdu||)
sārĕ nā sedulu nīdo sarasamu lāḍinānu
vāraga nāgoḽḽu nībai vām̐ḍimīrīni
nerubudo nā sĕlavi nīdo nĕṁta navvinānu
kūrimi nā pĕdavulu kŏsariṁpisīni
(||iṁdu||)
puḍami nā kām̐gili nī pŏṁdu lĕṁta sesinānu
vaḍim̐ jannulu kŏṁḍalavalĕ nŏttīni
yĕḍayaga śhrīveṁkaḍeśha nī devulanaidi
vuḍivoniradulu ninnubburem̐sīni