Imdugumgaa neevela yemmelaadevu

ఇందుకుఁగా నీవేల యెమ్మెలాడేవు
Language

(॥పల్లవి॥)
ఇందుకుఁగా నీవేల యెమ్మెలాడేవు
అందరిముందర నాపె నాఱడిఁ బెట్టెదరా

(॥ఇందు॥)
పడఁతికి వయసనేబలుగర్వ మొకటి
కడుఁజక్కఁదనములగర్వ మొకటి
బెడిదంపునిన్నువలపించినగర్వ మొకటి
జడియఁగ నీతో రాజసము చూపఁదగదా

(॥ఇందు॥)
సరిఁ గొండలంతేసిచన్నులసంపదొకటి
సరవిఁ గళలునిండుసంప దొకటి
గరిమతో మేనిసింగారపునంప దొకటి
దొరతనమే నీవద్ద తోడుచూపఁదగదా

(॥ఇందు॥)
చనవునీవిచ్చినట్టి సామ్రాజ్య మొకటి
మనికై నమదనసామ్రాజ్య మొకటి
యెనసితివి శ్రీవేంకటేశ యింతి నింతలోనె
వెనుకొని నీవలెనే విఱ్ఱవీఁగఁదగదా

(||pallavi||)
iṁdugum̐gā nīvela yĕmmĕlāḍevu
aṁdarimuṁdara nābĕ nāṟaḍim̐ bĕṭṭĕdarā

(||iṁdu||)
paḍam̐tigi vayasanebalugarva mŏgaḍi
kaḍum̐jakkam̐danamulagarva mŏgaḍi
bĕḍidaṁpuninnuvalabiṁchinagarva mŏgaḍi
jaḍiyam̐ga nīdo rājasamu sūbam̐dagadā

(||iṁdu||)
sarim̐ gŏṁḍalaṁtesisannulasaṁpadŏgaḍi
saravim̐ gaḽaluniṁḍusaṁpa dŏgaḍi
garimado menisiṁgārabunaṁpa dŏgaḍi
dŏradaname nīvadda toḍusūbam̐dagadā

(||iṁdu||)
sanavunīvichchinaṭṭi sāmrājya mŏgaḍi
manigai namadanasāmrājya mŏgaḍi
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṁti niṁtalonĕ
vĕnugŏni nīvalĕne viṭravīm̐gam̐dagadā