Imdugugaane yimti yimta sesenu

ఇందుకుగానే యింతి యింత సేసెను
Language

(॥పల్లవి॥)
ఇందుకుగానే యింతి యింత సేసెను
అందుకు లోనైనఁగాని ఆయములు నాఁటవు

(॥ఇందు॥)
వలపెంతగలిగినా వరునితోడుత సతి
చలపట్టి పెనఁగక చవిగాదు
సొలసి పాయఁగరానిచుట్టరిమైనాను
పిలిపించుకొన్నఁగాని ప్రియము లమరవు

(॥ఇందు॥)
చన వెంతగలిగినా సారెకు మాఁటలాడి
సానిపి దూరక రతి సూటిగాదు
ననిచి ఎట్టుండినాను నవ్వుతాను
కొనగోర చెనకినఁగాని సొంపు చేకూడదు

(॥ఇందు॥)
తగు లెంతగలిగినా తమకము పెడరేఁచి
జగడించి కలయక చక్కఁగాదు
మగువ గూడితి విట్టె మన్నించి శ్రీవేంకటేశ
అగపడియున్నఁగాని ఆసలు దైవారపు

(||pallavi||)
iṁdugugāne yiṁti yiṁta sesĕnu
aṁdugu lonainam̐gāni āyamulu nām̐ṭavu

(||iṁdu||)
valabĕṁtagaliginā varunidoḍuda sadi
salabaṭṭi pĕnam̐gaga savigādu
sŏlasi pāyam̐garānisuṭṭarimainānu
pilibiṁchugŏnnam̐gāni priyamu lamaravu

(||iṁdu||)
sana vĕṁtagaliginā sārĕgu mām̐ṭalāḍi
sānibi dūraga radi sūḍigādu
nanisi ĕṭṭuṁḍinānu navvudānu
kŏnagora sĕnaginam̐gāni sŏṁpu segūḍadu

(||iṁdu||)
tagu lĕṁtagaliginā tamagamu pĕḍarem̐si
jagaḍiṁchi kalayaga sakkam̐gādu
maguva gūḍidi viṭṭĕ manniṁchi śhrīveṁkaḍeśha
agabaḍiyunnam̐gāni āsalu daivārabu