ఇందుకుగా సవతుల నేల దూరేవే
(॥పల్లవి॥)
ఇందుకుగా సవతుల నేల దూరేవే
కందము నీ సత్తువెల్ల కతలేల చెప్పేవే
(॥॥)
వలవఁగవలె లేదా వలపించుకొనవలె
యెలమి నూరకే వుంటే నేఁటి యాఁటదే
చలమరి విభుఁడైతే సాగిటి మొక్కవే లేదా
బలిమి నీకుఁ గలితే పంపు సేయించుకోవే
(॥॥)
చొక్కవలెఁ దానే లేదా చొక్కించవలెఁ బతిని
యెక్కడికెక్కక వుంటే నేఁటి యాఁటదే
కక్కసీఁ దాతఁడైతే కడుఁ బ్రియాలాడు లేదా
తక్కరిని నీవైతే నాతని వంచుకొనవే
(॥॥)
నేరవలె రతి లేదా నేరుపనైనా వలె
యేరీతికి జొరకుంటే నేఁటి యాఁటదే
ఆరసి శ్రీవేంకటేశుఁడలమేల్మంగను నేను
గారవించి కూడె నీవూఁ గరుణింపించుకోవే
(||pallavi||)
iṁdugugā savadula nela dūreve
kaṁdamu nī sattuvĕlla kadalela sĕppeve
(||||)
valavam̐gavalĕ ledā valabiṁchugŏnavalĕ
yĕlami nūrage vuṁṭe nem̐ṭi yām̐ṭade
salamari vibhum̐ḍaide sāgiḍi mŏkkave ledā
balimi nīgum̐ galide paṁpu seyiṁchugove
(||||)
sŏkkavalĕm̐ dāne ledā sŏkkiṁchavalĕm̐ badini
yĕkkaḍigĕkkaga vuṁṭe nem̐ṭi yām̐ṭade
kakkasīm̐ dādam̐ḍaide kaḍum̐ briyālāḍu ledā
takkarini nīvaide nādani vaṁchugŏnave
(||||)
neravalĕ radi ledā nerubanainā valĕ
yerīdigi jŏraguṁṭe nem̐ṭi yām̐ṭade
ārasi śhrīveṁkaḍeśhum̐ḍalamelmaṁganu nenu
gāraviṁchi kūḍĕ nīvūm̐ garuṇiṁpiṁchugove