Imdugu sigguvadamga nimta yemtigi

ఇందుకు సిగ్గువడఁగ నింత యేఁటికి
Language

(॥పల్లవి॥)
ఇందుకు సిగ్గువడఁగ నింత యేఁటికి
కందువైన నీ వలపు కట్టిపెట్టవచ్చునా

(॥ఇందు॥)
యేకగ నెవ్వరిమన సెట్టుండినా నుండెఁగాక
అకెకు నీవు విడెమంపఁదగదా
వాకున నే మాడుకొన్న వారికే తెలుసుఁగాక
ఆకడ నీ వాకెకుఁ బ్రియముచెప్పఁదగదా

(॥ఇందు॥)
కంటగించి సవతులు కాఁతాళింతురుగాక
నంటున నీ వాకెతోడ నవ్వఁదగదా
అంటి తాము సన్నసేసుకొంటేఁ గొవిరిగాక
జంటతో నీవాకెమోవి చవిగొనఁదగదా

(॥ఇందు॥)
దూరి తాము నిన్ను కాలుదొక్కితేఁ దొక్కిరిగాక
ఆరసి నీవాపెఁ బెండ్లియాడఁదగదా
కూరిమ నన్నేలితివి గొబ్బున శ్రీవేంకటేశ
గారవించి నీ వందరిఁ గరుణించఁదగదా

(||pallavi||)
iṁdugu sigguvaḍam̐ga niṁta yem̐ṭigi
kaṁduvaina nī valabu kaṭṭibĕṭṭavachchunā

(||iṁdu||)
yegaga nĕvvarimana sĕṭṭuṁḍinā nuṁḍĕm̐gāga
agĕgu nīvu viḍĕmaṁpam̐dagadā
vāguna ne māḍugŏnna vārige tĕlusum̐gāga
āgaḍa nī vāgĕgum̐ briyamusĕppam̐dagadā

(||iṁdu||)
kaṁṭagiṁchi savadulu kām̐tāḽiṁturugāga
naṁṭuna nī vāgĕdoḍa navvam̐dagadā
aṁṭi tāmu sannasesugŏṁṭem̐ gŏvirigāga
jaṁṭado nīvāgĕmovi savigŏnam̐dagadā

(||iṁdu||)
dūri tāmu ninnu kāludŏkkidem̐ dŏkkirigāga
ārasi nīvābĕm̐ bĕṁḍliyāḍam̐dagadā
kūrima nannelidivi gŏbbuna śhrīveṁkaḍeśha
gāraviṁchi nī vaṁdarim̐ garuṇiṁcham̐dagadā