ఇందుకు నెవ్వరును యెగ్గులెంచరు
(॥పల్లవి॥)
ఇందుకు నెవ్వరును యెగ్గులెంచరు
సందుకొని ఆపెనేల సాదించేవు నీవు
(॥ఇందు॥)
వాడికగలచోటను వలచి వొకరొకరు
ఆడరానిమాటలైనా నాడుచుందురు
వూడిగము సేసేవారు వూసివాసు లెంచరు
జోడై తమ మేనులు సోఁకింతురు
(॥ఇందు॥)
సరసమాడేవేళ సమ్మతించి తమలోన
సరుగ మందెమేళాన జంకింతురు
వరుస విడెమిచ్చేవారు వింతసేయరు
అరిదిఁ దమచేతుల నంటింతురు
(॥ఇందు॥)
రతిఁ గలసేయప్పుడు రాజసము విడువరు
తతి గూడఁ దమలోనఁ దమకింతురు
యితవై శ్రీవేంకటేశ ఇంతి నీవూఁ గూడితిరి
చతురులైనవారు సతమే చింతింతురు
(||pallavi||)
iṁdugu nĕvvarunu yĕggulĕṁcharu
saṁdugŏni ābĕnela sādiṁchevu nīvu
(||iṁdu||)
vāḍigagalasoḍanu valasi vŏgarŏgaru
āḍarānimāḍalainā nāḍusuṁduru
vūḍigamu sesevāru vūsivāsu lĕṁcharu
joḍai tama menulu som̐kiṁturu
(||iṁdu||)
sarasamāḍeveḽa sammadiṁchi tamalona
saruga maṁdĕmeḽāna jaṁkiṁturu
varusa viḍĕmichchevāru viṁtaseyaru
aridim̐ damasedula naṁṭiṁturu
(||iṁdu||)
radim̐ galaseyappuḍu rājasamu viḍuvaru
tadi gūḍam̐ damalonam̐ damagiṁturu
yidavai śhrīveṁkaḍeśha iṁti nīvūm̐ gūḍidiri
sadurulainavāru sadame siṁtiṁturu