ఇందుకు నేనేమి సేతు నెరిఁగీ నెఱఁగవు
(॥పల్లవి॥)
ఇందుకు నేనేమి సేతు నెరిఁగీ నెఱఁగవు
సందడి వలపులను సారె భ్రమసితివి
(॥॥)
నామనసెరుగుఁదువు నాకు నీవిచ్చిన బుద్ది
ఆ మీఁద నాతో నేల ఆనవెట్టేవు
నీ మాటనే నమ్మనా నీవే చేఁతలెల్లాఁ జేసి
ఆముకొని నీకు నీవే అళికేవు గాక
(॥॥)
యింటిదాననే నీకు నిచ్చలోన దాననే
వెంట వెంటవచ్చి యేల వేఁడుకొనేవు
కంటకము నాకున్నదా గజరుఁగాంతల బొంది
అంటుకొని నామేను అలమేవు గాక
(॥॥)
చిన్న దాని నన్నుఁ దెచ్చి సేసవెట్టి కూడితివి
మన్నించి నాకేల బాసలిన్నీ నిచ్చేవు
కన్నకన్న గొల్లెతల కాఁపిరాలు సేసి వచ్చి
సన్నలు శ్రీవేంకటేశ సలిపేవు గాక
(||pallavi||)
iṁdugu nenemi sedu nĕrim̐gī nĕṟam̐gavu
saṁdaḍi valabulanu sārĕ bhramasidivi
(||||)
nāmanasĕrugum̐duvu nāgu nīvichchina buddi
ā mīm̐da nādo nela ānavĕṭṭevu
nī māḍane nammanā nīve sem̐talĕllām̐ jesi
āmugŏni nīgu nīve aḽigevu gāga
(||||)
yiṁṭidānane nīgu nichchalona dānane
vĕṁṭa vĕṁṭavachchi yela vem̐ḍugŏnevu
kaṁṭagamu nāgunnadā gajarum̐gāṁtala bŏṁdi
aṁṭugŏni nāmenu alamevu gāga
(||||)
sinna dāni nannum̐ dĕchchi sesavĕṭṭi kūḍidivi
manniṁchi nāgela bāsalinnī nichchevu
kannaganna gŏllĕdala kām̐pirālu sesi vachchi
sannalu śhrīveṁkaḍeśha salibevu gāga