Imdugu nenemi sedu idi neege telusunu

ఇందుకు నేనేమి సేతు ఇది నీకే తెలుసును
Language

(॥పల్లవి॥)
ఇందుకు నేనేమి సేతు ఇది నీకే తెలుసును
విందువలె లోలో వట్టివిచారాలు సేసేవు

(॥॥)
యెన్నఁడైనా నే నిన్ను యొగసక్కె మాడుదునా
కొన్నేసి నీవే గండించుకొందువుగాక
పన్ని నిన్ను నేఁ దప్పులు పట్టితినా యిటు తొల్లి
వున్నట్టేవుండి నీవే వులికిపడేవు

(॥॥)
యెచ్చరించి నే నేమైనా యేతువ లెత్తితినా
పచ్చిదేర నీవే సిగ్గుపడేవు గాక
నెచ్చులులముందరను నీపైఁ నింద మోపితినా
బచ్చెనమాటల నీవే బాసలు సేసేవు

(॥॥)
పూనిపట్టి యెప్పుడైనా బొమ్మల జంకించితినా
ఆనుక నీవే వెరగందేవు గాక
వీనుల నీ సుద్దులెల్లా విననా శ్రీ వేంకటేశ
నానాటికి నన్నునేలి నవ్వులు నవ్వేవు

(||pallavi||)
iṁdugu nenemi sedu idi nīge tĕlusunu
viṁduvalĕ lolo vaṭṭivisārālu sesevu

(||||)
yĕnnam̐ḍainā ne ninnu yŏgasakkĕ māḍudunā
kŏnnesi nīve gaṁḍiṁchugŏṁduvugāga
panni ninnu nem̐ dappulu paṭṭidinā yiḍu tŏlli
vunnaṭṭevuṁḍi nīve vuligibaḍevu

(||||)
yĕchchariṁchi ne nemainā yeduva lĕttidinā
pachchidera nīve siggubaḍevu gāga
nĕchchululamuṁdaranu nībaim̐ niṁda mobidinā
bachchĕnamāḍala nīve bāsalu sesevu

(||||)
pūnibaṭṭi yĕppuḍainā bŏmmala jaṁkiṁchidinā
ānuga nīve vĕragaṁdevu gāga
vīnula nī suddulĕllā vinanā śhrī veṁkaḍeśha
nānāḍigi nannuneli navvulu navvevu