Imdugu nemamdune yibudu nenu

ఇందుకు నేమందునే యిపుడు నేను
Language

(॥పల్లవి॥)
ఇందుకు నేమందునే యిపుడు నేను
ముందుముందె జాణఁడని మొక్కేనే నేను

(॥ఇందు॥)
కూరిమి వేరొకతెఁ దాఁ గూడఁగా నే జంకించితే
ఆరామపై నానవెట్టీ నాయఁగా నేను(డు)
కోరక నే నుండినాను కొమ్మచేత విడె మంపె
మేరిమీరి ఇది చూచి మేలంటినే నేను

(॥ఇందు॥)
ఆలిగి నే నుండఁగాను ఆకెచేఁ బిలువ నంపె
చెలువుని చేఁతకు మెచ్చితినే నేను
పలుక కుండఁగ నన్నాపడఁతి పేరఁ బిలిచె
నలుగడ నిందుకుఁగా నవ్వేఁబో నేను

(॥ఇందు॥)
తను నే నొట్టివెట్టితే తనసతి మొక్కించి
తనిసితి నిందుకుఁగా తగునే నేను
అనుగు శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడి
తనకాంతఁ జేతికిచ్చె దక్కఁగొంటి నేను

(||pallavi||)
iṁdugu nemaṁdune yibuḍu nenu
muṁdumuṁdĕ jāṇam̐ḍani mŏkkene nenu

(||iṁdu||)
kūrimi verŏgadĕm̐ dām̐ gūḍam̐gā ne jaṁkiṁchide
ārāmabai nānavĕṭṭī nāyam̐gā nenu(ḍu)
koraga ne nuṁḍinānu kŏmmaseda viḍĕ maṁpĕ
merimīri idi sūsi melaṁṭine nenu

(||iṁdu||)
āligi ne nuṁḍam̐gānu āgĕsem̐ biluva naṁpĕ
sĕluvuni sem̐tagu mĕchchidine nenu
paluga kuṁḍam̐ga nannābaḍam̐ti peram̐ bilisĕ
nalugaḍa niṁdugum̐gā navvem̐bo nenu

(||iṁdu||)
tanu ne nŏṭṭivĕṭṭide tanasadi mŏkkiṁchi
tanisidi niṁdugum̐gā tagune nenu
anugu śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍi
tanagāṁtam̐ jedigichchĕ dakkam̐gŏṁṭi nenu