ఇందుకు నీ వాపెను యెట్టు లాలించేవో కాని
(॥పల్లవి॥)
ఇందుకు నీ వాపెను యెట్టు లాలించేవో కాని
పొందులు నెరపి సతిఁ బొదుగఁగవలెను
(॥ఇందుకు॥)
మగువ నిన్ను దూరి మనసు నొచ్చెనో యని
పొగులుచు నటు చిన్నఁబోయి వున్నది
నిగిడి నిన్ను జంకించి నీకు లాఘవమో యని
వగలఁ బొరలి తల వంచుకొని వున్నది
(॥ఇందుకు॥)
భామిని నీతోఁ జెనఁగి పాదము దాఁకెనో యని
ఆముకొని అసురుసురయి వున్నది
చేముంచి వెంగెము లాడి సిగ్గు వడితివో యని
యేమి సేతు నని మది నిట్టే చింత నున్నది
(॥ఇందుకు॥)
పడఁతి రతి గెలిచి నీ పంతము దప్పెనో యని
అడరి తనలో వెరగంది వున్నది
యడయక శ్రీవేంకటేశుఁడ నీ వుర మెక్కి
చిడిముడి వినయాన చేత మొక్కుచున్నది
(||pallavi||)
iṁdugu nī vābĕnu yĕṭṭu lāliṁchevo kāni
pŏṁdulu nĕrabi sadim̐ bŏdugam̐gavalĕnu
(||iṁdugu||)
maguva ninnu dūri manasu nŏchchĕno yani
pŏgulusu naḍu sinnam̐boyi vunnadi
nigiḍi ninnu jaṁkiṁchi nīgu lāghavamo yani
vagalam̐ bŏrali tala vaṁchugŏni vunnadi
(||iṁdugu||)
bhāmini nīdom̐ jĕnam̐gi pādamu dām̐kĕno yani
āmugŏni asurusurayi vunnadi
semuṁchi vĕṁgĕmu lāḍi siggu vaḍidivo yani
yemi sedu nani madi niṭṭe siṁta nunnadi
(||iṁdugu||)
paḍam̐ti radi gĕlisi nī paṁtamu dappĕno yani
aḍari tanalo vĕragaṁdi vunnadi
yaḍayaga śhrīveṁkaḍeśhum̐ḍa nī vura mĕkki
siḍimuḍi vinayāna seda mŏkkusunnadi