ఇందుకు మెచ్చిరి నీ ఇంతులెల్లాను
(॥పల్లవి॥)
ఇందుకు మెచ్చిరి నీ ఇంతులెల్లాను
చందమామ నీ పనులు చక్కఁగూచుండవయ్యా
(॥ఇందు॥)
నెలఁతపాదముతోడ నీపాదము పెనచి
నిలుచుండి కాఁగిట నించె వాకెను
అలిగి లోనికిఁ బోయేయప్పు డింత సేసితివి
ఇలలో జాణవౌదువు ఇట్టె కూచుండవయ్యా
(॥ఇందు॥)
మొనసి చెలిపయ్యద ముంజేతఁ జుట్టకొని
తనివారఁ బిసికే వందపుగుబ్బలు
పెనఁగి తప్పించుకోఁగా ప్రేమతో సాదించితివి
ఘనుఁడవైతివి నేఁ డిక్కడఁ గూచుండవయ్యా
(॥ఇందు॥)
అలమేల్మంగచెక్కున నటు నీచెక్కు పొందించీ
తలవంచుకొన్నా పెచింత మాన్పితివి
బలిమి శ్రీవేంకటేశ పంతపాకెఁ గూడితివి
అలరితి రొక్కమనసాయఁ గూచుండరయ్యా
(||pallavi||)
iṁdugu mĕchchiri nī iṁtulĕllānu
saṁdamāma nī panulu sakkam̐gūsuṁḍavayyā
(||iṁdu||)
nĕlam̐tabādamudoḍa nībādamu pĕnasi
nilusuṁḍi kām̐giḍa niṁchĕ vāgĕnu
aligi lonigim̐ boyeyappu ḍiṁta sesidivi
ilalo jāṇavauduvu iṭṭĕ kūsuṁḍavayyā
(||iṁdu||)
mŏnasi sĕlibayyada muṁjedam̐ juṭṭagŏni
tanivāram̐ bisige vaṁdabugubbalu
pĕnam̐gi tappiṁchugom̐gā premado sādiṁchidivi
ghanum̐ḍavaidivi nem̐ ḍikkaḍam̐ gūsuṁḍavayyā
(||iṁdu||)
alamelmaṁgasĕkkuna naḍu nīsĕkku pŏṁdiṁchī
talavaṁchugŏnnā pĕsiṁta mānpidivi
balimi śhrīveṁkaḍeśha paṁtabāgĕm̐ gūḍidivi
alaridi rŏkkamanasāyam̐ gūsuṁḍarayyā