ఇందుకు మెచ్చవద్దా యీపెను నీవు
(॥పల్లవి॥)
ఇందుకు మెచ్చవద్దా యీపెను నీవు
కందువ సేవలు సేసి కరఁచీ నీ మనసు
(॥ఇందు॥)
కలికి చేఁతలు సేసి కప్పరము మోవిఁ జూపి
బిలిచీ సన్నల నాకెఁ(కె?) బ్రే(ప్రే) మతో నిన్ను
మొలక నవ్వులు నవ్వి మొగము దప్పక చూచి
తలఁపించీఁ దనపొందు తమ్మిపూవాట్ల
(॥ఇందు॥)
కతకారిమాట లాడి కానుకలు చేతికిచ్చి
రతికి నాసలురేఁచీ రచ్చలో నిన్ను
చతురతలఁ జెనకి చవులు నీకుఁ బుట్టించి
అతిమోహము దెలిపీ నంగపు సోఁకులను
(॥ఇందు॥)
సరుసనే కూచుండి జమళిఁ జన్నుల నూఁది
తరితీపులెల్లాఁ జేసి తగిలీ నిన్ను
ఇరవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
సరిఁగూడి బుజ్జగించీ చల్లువలపులను
(||pallavi||)
iṁdugu mĕchchavaddā yībĕnu nīvu
kaṁduva sevalu sesi karam̐sī nī manasu
(||iṁdu||)
kaligi sem̐talu sesi kapparamu movim̐ jūbi
bilisī sannala nāgĕm̐(kĕ?) bre(pre) mado ninnu
mŏlaga navvulu navvi mŏgamu dappaga sūsi
talam̐piṁchīm̐ danabŏṁdu tammibūvāṭla
(||iṁdu||)
kadagārimāḍa lāḍi kānugalu sedigichchi
radigi nāsalurem̐sī rachchalo ninnu
saduradalam̐ jĕnagi savulu nīgum̐ buṭṭiṁchi
adimohamu dĕlibī naṁgabu som̐kulanu
(||iṁdu||)
sarusane kūsuṁḍi jamaḽim̐ jannula nūm̐di
taridībulĕllām̐ jesi tagilī ninnu
iravai śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sarim̐gūḍi bujjagiṁchī salluvalabulanu