Imdugu jamkimchanele taanu

ఇందుకు జంకించనేలే తాను
Language

(॥పల్లవి॥)
ఇందుకు జంకించనేలే తాను
సందడి నావల్ల చల మున్నదా

(॥ఇందు॥)
వొదద్నుండఁగా వొరసీఁ జన్నులు
పెద్దరికానకుఁ బెనఁగేనా
సుద్దులు చెప్పఁగా సొఁకె నాకెమ్మోవి
వుద్దండము లిందుకు నున్నవటే

(॥ఇందు॥)
వీడె మియ్యఁగా వెస గోరు సోఁకె
జాడతో తను నే సాదించేనా
పాడఁగానే తనపైఁ జెమట చిందె
యాడనే పంతాలు హెచ్చెనటే

(॥ఇందు॥)
సరసమాడఁగా సమరతు లబ్బెను
నెరసి దొరతనము నించితినా
కరుణించి శ్రీవేంకటేశుఁడు గూడె
గురుఁడు మరునికినిఁ గొంకెనటే

(||pallavi||)
iṁdugu jaṁkiṁchanele tānu
saṁdaḍi nāvalla sala munnadā

(||iṁdu||)
vŏdadnuṁḍam̐gā vŏrasīm̐ jannulu
pĕddarigānagum̐ bĕnam̐genā
suddulu sĕppam̐gā sŏm̐kĕ nāgĕmmovi
vuddaṁḍamu liṁdugu nunnavaḍe

(||iṁdu||)
vīḍĕ miyyam̐gā vĕsa goru som̐kĕ
jāḍado tanu ne sādiṁchenā
pāḍam̐gāne tanabaim̐ jĕmaḍa siṁdĕ
yāḍane paṁtālu hĕchchĕnaḍe

(||iṁdu||)
sarasamāḍam̐gā samaradu labbĕnu
nĕrasi dŏradanamu niṁchidinā
karuṇiṁchi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
gurum̐ḍu maruniginim̐ gŏṁkĕnaḍe